Ads
జబర్దస్త్.. ఎందరో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాదు.. ఎందరో ఆర్టిస్ట్ లకు ఓ దారిని కూడా చూపించింది. జబర్దస్త్ మొదలైన తొలినాళ్లలో ఎక్కువ గా అబ్బాయిలే ఆర్టిస్ట్ లు గా ఉండే వారు. ఆడ ఆర్టిస్ట్ లు అవసరం అయినప్పుడు కూడా మగవారే ఆడవారి గెటప్ లు వేసి అలరిస్తూ ఉండేవారు. అదో యూనీక్ గా చాలాకాలం జబర్దస్త్ లో కొనసాగింది.
Video Advertisement
అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఫ్యామిలీ మెంబెర్స్ కూడా స్టేజి పై పలు పంచుకుంటున్నారు. పండుగలు, స్పెషల్ ఈవెంట్స్ సందర్భంగా ప్రసారం అయ్యే స్పెషల్ షో లలో ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కలిసి సందడి చేస్తున్నారు.
సాధారణంగా ఈ స్పెషల్ ఈవెంట్స్ లలో కమెడియన్స్ అందరు కలిసి అనుకున్న థీమ్ ప్రకారం స్కిట్ లు, డాన్స్ లు వేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. పండుగల శుభ సందర్భంగా మన ఇంట్లో సందడిని సృష్టిస్తుంటారు. అయితే.. ఈ స్పెషల్ ఈవెంట్స్ కు ఇటీవల ఫ్యామిలీ మెంబెర్స్ కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్ టైం చేస్తూ ఉంటారు.
మొదట్లో ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ ను ఈటివి మాత్రమే ప్లాన్ చేసేది. కానీ ఇటీవల జీ తెలుగు, స్టార్ మా వంటి ఛానెల్స్ కూడా ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేసి ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే.. గెస్ట్ అప్పియరెన్స్ ల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కి ప్రత్యేకంగా పారితోషికం ఉంటుందా..? అన్న డౌట్ చాలా మందికే ఉంది.
అయితే.. అసలు లెక్కల ప్రకారం కమెడియన్స్ కుటుంబ సభ్యులను తీసుకొచ్చేదే పాపులారిటీ కోసం. కాబట్టి.. వారి కుటుంసభ్యులకు ప్రత్యేకంగా పారితోషికం ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఉదాహరణగా, ఇటీవలి కొన్ని స్కిట్స్ లలో బుల్లెట్ భాస్కర్ తండ్రి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి అలరించారు. అయితే.. ఆయన ద్వారా బుల్లెట్ భాస్కర్ కు మరింత పేరు వచ్చింది. భాస్కర్ కు మంచి గుర్తింపుతో పాటు మంచి పారితోషికం కూడా లభిస్తుంది. కాబట్టి ఫ్యామిలీ మెంబెర్స్ కు ప్రత్యేకంగా పారితోషికం ఇవ్వాల్సిన అవసరం లేదని మల్లె మాల వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. వారికి దారి ఖర్చులు, ట్రావెల్ ఖర్చులు వంటి వాటిని మాత్రం మల్లెమాల భరిస్తుంది.
End of Article