గుంటూరు కారం సెన్సార్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?

గుంటూరు కారం సెన్సార్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?

by Mohana Priya

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు కారణం వీరిద్దరి కాంబినేషన్. చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తోంది.

Video Advertisement

ఈ సినిమా స్టోరీ మొదట వేరేది అనుకున్నా కూడా తర్వాత మార్చి ఫ్యామిలీ ఎమోషన్స్ యాడ్ చేసి సినిమా తీశారు. ఎన్ని మార్పులు జరిగినా కూడా అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేసి సంక్రాంతికి సినిమా విడుదల చేస్తున్నారు.

guntur kaaram fan theories

ప్రస్తుతం సినిమా బృందం ప్రమోషన్స్ పనిలో ఉంది. ఇప్పటికే పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. జనవరి 6వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి ఆ రోజు ట్రైలర్ కూడా విడుదల చేస్తారు. ప్రమోషన్స్ కోసం సినిమా బృందం ఇంటర్వ్యూలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందులో కొన్ని ఇంటర్వ్యూలలో మహేష్ బాబు పాల్గొంటారు. అయితే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాకి సెన్సార్ సభ్యులు యూఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా సెన్సార్ టాక్ కూడా బయటకు వచ్చేసింది.

ప్రస్తుతం బయటికి వచ్చిన టాక్ ప్రకారం సినిమాలో ఎమోషన్స్ చాలా బాగా వచ్చాయట.  సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నాయి. అంతే కాకుండా మహేష్ బాబు కూడా ఒక కొత్త రకమైన పాత్రలో కనిపిస్తారు. సినిమా మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగుతుంది. దాంతో ఈసారి త్రివిక్రమ్ ఎమోషన్స్ తెరపై కనిపిస్తాయి.

అయితే సంక్రాంతి బరిలో గుంటూరు కారంతో పాటు, నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ, తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్, వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్, తమిళ్ డబ్బింగ్ సినిమాల్లో శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్, ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్, హిందీలో కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న మేరీ క్రిస్మస్ సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. ఇంత కాంపిటీషన్ ఉండడం ఇదే మొదటి సారి ఏమో. దాంతో ఏ సినిమా హిట్ అవుతుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ పండగ కాబట్టి ప్రతి సినిమాకి మంచి టాక్ వస్తే బాగుండు అని కూడా అనుకుంటున్నారు.


You may also like

Leave a Comment