Ads
కొన్ని సినిమాల్లో కొన్ని పదాలు కానీ, డైలాగ్స్ కానీ సరదాకి వాడతారు. కానీ తర్వాత కొద్ది సినిమాల్లో అవి కనిపిస్తాయి. ముందు చెప్పినది చెప్పినట్టే ఇందులో జరిగినట్టు ఉంటుంది. అలా చాలా సినిమాల్లో జరిగాయి. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలోని జరగండి పాటలో కూడా ఇలాంటి విషయం ఒకటి జరిగింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ, ఈ సినిమా నుండి, జరగండి జరగండి అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో స్టెప్స్ చాలా ఎనర్జిటిక్ గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇంక శంకర్ సినిమాలో పాటలు అంటే చెప్పాల్సిన అవసరం లేదు.
Video Advertisement
సెట్టింగ్స్ నుండి, కాస్ట్యూమ్స్ వరకు చాలా కొత్తగా ఉంటాయి. పాటల్లో ఆయన స్టైల్ అంటే మిగిలిన దర్శకులకి ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. చాలా మంది అలాంటి స్టైల్ లో, అంత గ్రాండ్ గా ఒక్క పాట అయినా చేయాలి అని ఆశ పడుతూ ఉంటారు. అయితే, ఇంక ఈ పాట విషయానికి వస్తే, మధ్యలో కొన్ని వింత వింత పదాలు వాడారు. అవన్నీ క్యాచీగా ఉండటం కోసం వాడారు. అందులో వినిపించిన ఒక పదం గుమ్స్. ఇదే పదం ఇటీవల మరొక సినిమాలో విన్నాం. ఈ పేరుతో ఒక హీరో హాస్పిటల్ పెడతాను అని చెప్పారు. అదే సినిమా.
గుంటూరు కారం సినిమాలో, హరిదాసు ఎపిసోడ్ లో, ఫైటింగ్ సీన్ జరుగుతున్నప్పుడు మధ్యలో, హరిదాసుకి హీరో పెద్ద సూది పెట్టి గుచ్చుతాడు, అప్పుడు గాయం బాగా లోతుగా దిగింది అని హీరో చెప్తే, హరిదాసు వైద్యం చేయమని అడుగుతాడు. అప్పుడు హీరో, “నాకే కానీ అంత పనితనం వచ్చి ఉంటే ఈ కిమ్స్, నిమ్స్ లాగా మా గుంటూరులో గుమ్స్ అని పెట్టుకుంటానుగా” అని సరదాగా అంటాడు. ఇప్పుడు ఈ పాటలో ఇదే పదం వినిపించింది. దాంతో ఒక నెటిజన్ ఆ పదాన్ని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసి, “ఇది గుంటూరులో ఉన్న ప్రముఖ హాస్పిటల్స్ లో ఒకటి” అని రాశారు. దాంతో ఇంతే కామెడీగా ఆ పోస్ట్ కి కామెంట్స్ కూడా చేస్తున్నారు. మహేష్ బాబు ఏదో సరదాకి చెప్తే, రామ్ చరణ్ సీరియస్ గా తీసుకున్నారు అని అంటున్నారు. ఆ హాస్పిటల్ లో రమణ అనే ఫేమస్ డాక్టర్ కూడా ఉన్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ : ఒకే లాగ కనిపించే 9 మంది హీరోస్.! లిస్ట్ లో ఎవరెవరున్నారో చూడండి.!
End of Article