మీనాక్షి ఉందనే విషయాన్ని మర్చిపోయారా ఏంటి? ఎక్కడా ఆమె ఉసే లేదు…!

మీనాక్షి ఉందనే విషయాన్ని మర్చిపోయారా ఏంటి? ఎక్కడా ఆమె ఉసే లేదు…!

by Mounika Singaluri

మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే మూవీ తోటి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ సరిగ్గా ఆడకపోయినా కూడా అమ్మడికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తర్వాత రవితేజ సరసన ఖిలాడి మూవీలో నటించింది.ఈ మూవీ ఫ్లాప్ అయినా కూడా మీనాక్షి అందాలకు అభిమానులు ముగ్ధులు అయ్యారు. తర్వాత అడివి శేష్ తోన్నటించిన హిట్ 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే మీనాక్షికి తెలుగులో వరుస పెట్టి ఆఫర్లు రావడం మొదలైంది.

Video Advertisement

అమ్మడి అదృష్టం ఎంత బాగుందంటే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారంలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో శ్రీ లీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే గుంటూరు కారం సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి.

పలు పోస్టర్లు కూడా విడుదల చేశారు. అయితే ఇప్పటివరకు ఇందులోనూ మీనాక్షి చౌదరి ఫోటో కనిపించలేదు. కనీసం అమ్మడి ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ విడుదల చేయలేదు. ఇంకా సినిమాల్లో విడుదలకు 15 రోజుల కన్నా తక్కువ సమయం ఉంది. ఇప్పటికే కూడా మీనాక్షి కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో ఆమె అభిమానులు అసలు గుంటూరు కారం సినిమాలో మీనాక్షి ఉందనే విషయాన్ని గుర్తుందా లేక మర్చిపోయారా అంటూ మేకర్స్ ను క్వశ్చన్ చేస్తున్నారు. త్వరలో మీనాక్షి సంబంధించిన అప్డేట్ గుంటూరు కారం టీం విడుదల చేస్తుందేమో చూడాలి


You may also like

Leave a Comment