Ads
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అతడు, ఖలేజా, ఇప్పుడు గుంటూరు కారం. అతడులో కామిడీ, ఖలేజాలో డైలాగులు ఇప్పటికీ మర్చిపోలేని సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అందుకే ఇప్పుడు వీరి కాంబోలో వచ్చే గుంటూరు కారం కోసం అంతలా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.
Video Advertisement
కానీ ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి చివరి వరకు అన్నీ ఆటంకాలే. వరస రీషెడ్యూల్స్ తో, పోస్ట్ పోన్లతో, నటీ నటులు తప్పుకోడంతో ఇలా అనేక కారణాల వల్ల సినిమా అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదు. దీంతో అభిమానుల ఆవేశానికి, చిరాకుకి అంతు లేకుండా పోయింది. ఇలా ఇన్ని ఇబ్బందుల నడుమ చివరకి ఈ సినిమాలో సాంగ్ ఒకటి ఫైనల్ అయ్యింది.
అయితే ఈ సినిమాలో మొదట పూజ హెగ్డే ను అనుకొగా… కొన్ని కారణాల వల్ల తను సినిమా నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. అలా మొదటి సమస్య ఒకటి ఏర్పడింది. ఇక ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం పెద్దగా నచ్చకపోవడంతో మళ్లీ మళ్ళీ రీ టెస్టింగ్ చేస్తున్నారు. అలా థమన్ కూడా ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు సమాచారం వచ్చింది.
దానికి కారణం థమన్ పని నచ్చకపోవడం. ఈ సినిమానే కాకుండా అంతకు ముందు కూడా థమన్ అందిస్తున్న మ్యూజిక్ అంత స్యాటిస్ఫ్యాక్షన్ గా లేకపోవడం వల్లే అని చెప్పొచ్చు. కాబట్టి చివరి సారిగా థమన్ వర్క్ త్రివిక్రమ్ కి నచ్చితే సాంగ్ ఫైనల్ అవుతుంది. కానీ ఇది కేవలం త్రివిక్రమ్ చేతిలోనే కాదు సాంగ్ మహేష్ బాబుకి కూడా నచ్చాలన్నమాట. ఒకవేళ సాంగ్ ఓకే అయితే మహేష్ పుట్టిన రోజున గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యే అవకాశం ఉంటుంది.
ఇక గుంటూరు కారం సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన శ్రీలీల నటిస్తుండగా… పూజ హెగ్డే కోసం రాసిన పాత్రలో తను తొలగిపోయినందుకు ఆ స్థానంలో మీనాక్షి చౌదరిని అనుకున్నారు. ప్రస్తుతం అన్ని ఇబ్బందులు తొలగి జనవరి 13న సినిమా విడుదల అయ్యేందుకు అన్నీ పనులు పూర్తి చేస్తున్నారు.
ALSO READ : కేజీఎఫ్ -3 కి ఆంక్షలు విధించిన హీరో యష్..! ఆ రూల్స్ ఏంటో తెలుసా??
End of Article