Ads
ఇటీవల పెళ్లి పేరిట మోసాలు కొంత ఎక్కువగానే జరుగుతున్నాయి. అమ్మాయిలు తక్కువగా దొరుకుతుండడంతో.. దీనిని అవకాశంగా చేసుకుని కొంతమంది ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఇటువంటి ఘటనే గుంటూరు జిల్లా పరిధిలో చోటు చేసుకుంది.
Video Advertisement
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస రావు బిటెక్ పూర్తి చేసి ప్రస్తుతం మోటో కంట్రోలర్ మెకానిక్ గా పని చేస్తున్నారు. అతని తండ్రి పోలియోతో బాధపడుతున్నారు. తల్లికి కూడా అనారోగ్యంగానే ఉంటోంది. అయితే.. అతనికి పెళ్లికి చేయాలని వారు నిశ్చయించుకున్నారు.
Also Read: “జయం” సినిమాకి “గోపీచంద్” అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? ఆ డబ్బుతో ఏం చేసారంటే.?
కాగా, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లోని ఓ రిటైర్డ్ ఎంప్లాయ్ ద్వారా వారికి ఓ సంబంధం వచ్చింది. రెండువైపులా నచ్చడంతో వారు ముందుకెళ్లి మిగతా విషయాలు మాట్లాడుకున్నారు. అయితే.. ఆ అమ్మాయికి తండ్రి లేడు. దీనితో.. శ్రీనివాస్ మనసు పెద్దది చేసుకుని ఆమె వద్ద నుంచి కట్నం ఆశించకుండా పెళ్లి చేసుకున్నాడు. కాగా, రెండు లక్షలు పెట్టి ఉన్నంతలో బంగారం చేయించి పెళ్లి సమయంలోనే ఆమెకు ఇచ్చాడు.
అలానే బంధువుల సమక్షంలో ఆరు లక్షలు పెట్టి ఊర్లోనే ఘనంగా రిసెప్షన్ కూడా చేయించాడు. ఇంత జరిగాక.. ఆమె పెళ్లి అయిన తరువాత నుంచి ఏదో ఒక కారణం చెప్పి దూరం పెట్టేది. కొన్నాళ్ళకి ఇంట్లో తల్లి ఆరోగ్యం బాలేదని చూసి వస్తానని చెప్పి వెళ్ళింది. రెండు, మూడు నెలలు అయినా ఆమె తిరిగి రాలేదు. దీనితో ఎందుకు రావట్లేదు అంటూ శ్రీనివాస రావు ఆరా తీసాడు. ఈ క్రమంలో ఆమెకు గతంలోనే ఓ యువకుడితో పెళ్లి అయ్యిందని తేలింది. షాక్ అయిన శ్రీనివాస రావు తనని మోసం చేసారని భావించి యువతి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
End of Article