సినీ నటి విజయలక్ష్మి అంటే తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ హనుమాన్ జంక్షన్ లో హీరో వేణు హీరోయిన్ గా సుపరిచితమే. విజయలక్ష్మి ఎక్కువగా, కన్నడ, తమిళ చిత్రాలలో నటించి, మెప్పించారు. తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ గెలుచుకున్న హీరోయిన్ విజయలక్ష్మి.

Video Advertisement

అయితే గత కొన్నేళ్లుగా విజయలక్ష్మి తరచూ వార్తల్లో నిలిస్తున్నారు. కోలీవుడ్ నటుడు మరియు దర్శకుడు సీమాన్‌ మోసం చేశారని గతంలో విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే రీసెంట్ గా సీమాన్‌ పై చెన్నై పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
విజయలక్ష్మి చెన్నై లో జన్మించింది. ఆమె బెంగళూరులో చదువుకుంది. 1997లో ‘నాగమండలం’ అనే కన్నడ మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ మూవీలో ప్రకాశ్‌ రాజ్‌కు జంటగా నటించింది. తొలి మూవీతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారారు. తమిళంలో కూడా పలు సినిమాలలో విజయలక్ష్మి నటించింది. తెలుగులో హనుమాన్ జంక్షన్‌ మరియు పృథ్వి నారాయణలో నటించారు. ఒక మలయాళ మూవీలో మోహన్‌లాల్‌తో కలిసి నటించింది. ఆమె కెరీర్‌లో సుమారు 40 చిత్రాలలో నటించింది.
పలువురు స్టార్ హీరోల పక్కన హిరోయిన్ గా నటించిన విజయలక్ష్మి, తమిళ నటుడు, దర్శకుడు మరియు నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీ అధినేత అయిన సీమాన్‌ పై ఫిబ్రవరి 2020లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. అతను తనను వివాహం చేసుకుంటానని చెప్పి, మోసం చేశాడని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఆ తరువాత సీమాన్‌ వేధింపులు భరించలేక 2020 లో బలవన్మరణానికి కూడా పాల్పడింది. ఈ క్రమంలోనే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలతో విజయలక్ష్మి కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది.
ఇటీవలే విజయలక్ష్మి మరోసారి సీమాన్‌ పై ఆరోపణలు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని,  ఏడు సార్లు సీమన్ బలవంతంగా అబార్షన్ చేయించినట్టు విజయలక్ష్మి ఆరోపించింది. అది మాత్రమే కాకుండా తన  నగలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. న్యాయం చేయమని అడిగితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారని  సీమన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకుని, సీమాన్‌ను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.

Also Read: “బాలకృష్ణ” కి అప్పుడు హీరోయిన్‌గా, ఇప్పుడు తల్లిగా నటించిన… ఒకే ఒక్క నటి ఎవరో తెలుసా..?