సాధారణంగా మన ఆలోచనలలాంటివే ఇంకొకరికి వస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా కథని పోలిన కథతో మరొక సినిమా రావడం, కాస్ట్యూమ్స్ ఒకేలా ఉండడం, ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి.

Video Advertisement

ఒక సినిమాలోని సీన్ పోలిన మరొక సీన్ కూడా ఉంటూనే ఉంటుంది. వివరాల్లోకి వెళితే, జగపతి బాబు, అర్జున్ హీరోలుగా నటించిన సినిమా హనుమాన్ జంక్షన్. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కూడా మరొక హీరోగా నటించారు. ఇందులో లయ, స్నేహ, అలాగే విజయలక్ష్మి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అప్పుడు సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ఒక సీన్ ఇటీవల విడుదలయిన ఒక సినిమాలోని ఒక సీన్ కి దగ్గరగా ఉంది.

hanuman junction scene is similar to a scene in recent superhit movie

ఇందులో హీరో జగపతి బాబుకి దెబ్బలు తగిలినప్పుడు మరొక హీరో అయిన అర్జున్ జగపతిబాబుని తన మీద కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తారు. ఇదే సీన్ మనం ఇటీవల విడుదల అయిన ఆర్ఆర్ఆర్ లో కూడా చూసాం. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించిన రామ్ చరణ్ ని కొమరం భీమ్ పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ మీద కూర్చోపెట్టుకుని ఫైట్ చేస్తారు. ఈ సీన్ థియేటర్లలో చూసినప్పుడు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది.

rrr movie review

ఇలా ఈ ఒక్క సినిమా విషయంలో మాత్రమే కాదు చాలా సినిమాల విషయంలో జరిగింది. ఒక సీన్ ని పోలిన సీన్ కానీ, ఒక పాట ట్యూన్ ని పోలిన ట్యూన్ కానీ చాలా సినిమాల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఏదేమైనా సినిమా మాత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ సృష్టించింది. రాజమౌళి మరొకసారి తాను పాన్ ఇండియన్ డైరెక్టర్ అని నిరూపించుకున్నారు. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా చూసిన ఎంతో మంది ఈ సినిమాని అందులో నటించిన వారిని ప్రశంసిస్తున్నారు.

watch video :