హనుమాన్ సినిమాకి ఇన్ని కోట్లు వచ్చినా కూడా నిర్మాతకు లాభాలు దక్కలేదా..? అలా చేసి ఉంటే..?

హనుమాన్ సినిమాకి ఇన్ని కోట్లు వచ్చినా కూడా నిర్మాతకు లాభాలు దక్కలేదా..? అలా చేసి ఉంటే..?

by Mohana Priya

Ads

సంక్రాంతి పండగ అంటేనే సినిమాల పండగ. చాలా సినిమాలు సంక్రాంతికి విడుదల అవుతాయి. ఈ సంవత్సరం కూడా అలాగే విడుదల అయ్యాయి. పెద్ద హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా ఇందులో ఉన్నాయి.

Video Advertisement

వాటిలో పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అయ్యి హిట్ సాధించిన సినిమా హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి రెండవ భాగం అయిన జై హనుమాన్ కూడా 2025 లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాని నిరంజన్ రెడ్డి నిర్మించారు.

hanuman movie profits were not acquired by niranjan reddy

సినిమా ఇప్పటికే లాభాల్లో దూసుకుపోతోంది. మొదట తక్కువ స్క్రీన్స్ లో విడుదల అయిన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చాక స్క్రీన్స్ పెంచారు. అయితే అంత లాభాలు వచ్చినా కానీ ఆ లాభాల్లో కొంత వరకు కూడా నిరంజన్ రెడ్డికి రాలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం, ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ని మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ సొంతం చేసుకుంది. హిందీ విషయంలో కూడా ఇదే పని చేసినట్టు సమాచారం.

అందుకే, లాభాల్లో ప్రొడ్యూసర్ అయిన నిరంజన్ రెడ్డికి కొంత మొత్తం కూడా దక్కలేదు. కానీ సినిమా విడుదలకి ముందే జరిగిన బిజినెస్ లో సినిమాకి లాభాలు వచ్చాయి. ఆ మొత్తం ప్రొడ్యూసర్ కి దక్కుతుంది. కానీ ఏదేమైనా సరే సినిమా ఓన్ రిలీజ్ చేసుకుని ఉంటే, అప్పుడు లాభాలు కచ్చితంగా నిర్మాత సొంతం అయ్యేవి అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.

హనుమాన్ ఇంకొక వారం రోజులు రన్ గ్యారెంటీగా ఉంటుంది. అందులో కూడా 50 కోట్ల నుండి 100 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా బృందం జై హనుమాన్ సినిమా పనిలో బిజీగా ఉంది. ఇంకా తర్వాత కూడా ఈ సినిమాకి సంబంధించి కొన్ని భాగాలు విడుదల అవుతాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ రూపంలో ఈ సినిమాలు రూపొందుతాయి. మరి అందులో ఏ హీరోలు నటిస్తారు అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

ALSO READ : తిరుమలలో “శ్రియ”తో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? ఇంత అందంగా ఉంది అనుకుంటున్నారా.!


End of Article

You may also like