”హనుమాన్” స్టోరీ ఇదేనా..?

”హనుమాన్” స్టోరీ ఇదేనా..?

by Megha Varna

Ads

చైల్డ్ ఆర్టిస్ట్ అయిన తేజా సజ్జ ఓ కొత్త సినిమా తో ఇప్పుడు వస్తున్నాడు. తేజ సజ్జ హీరోగా ”హనుమాన్” సినిమా త్వరలో రాబోతోంది. జాంబిరెడ్డి వంటి సినిమాల తో మెప్పించిన తేజా హనుమన్ సినిమా తో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడు అనేది చూడాల్సి వుంది. ఇక ఈ హనుమాన్ సినిమా కి సంబంధించి వివరాల్ని చూస్తే..

Video Advertisement

ఈ హనుమాన్ సినిమా కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. చైల్డ్ యాక్టర్ నుండి హీరో కి ఎదగడం అనేది నిజంగా మాములు విషయం కాదు.

ఈ సినిమాలో తేజ తో పాటుగా అమృత అయ్యర్, వర లక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ ని గౌర హరి, అనుదీప్ దేవ్ మరియు కృష్ణ సౌరబ్ అందిస్తున్నారు. వెంకట్ కుమార్ జెట్టి, కుశల్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా పని చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈ సినిమా టీజర్ కూడా విడుదల అయ్యింది. దాని గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడారు. ప్రశాంత్ వర్మ కి ఇష్టమైన హనుమాన్ పాత్ర తో సినిమా చేయడం ఆనందంగా వుంది ప్రశాంత్ వర్మ అన్నారు. అలానే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని చెప్పారు. ఈ సినిమాకి అనుకున్న దాని కంటే బడ్జెట్ ఆరు ఇంతలు ఎక్కువ అయ్యింది అని అన్నారు. హనుమంతుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన అనుగ్రహంతో ఆ శక్తి వస్తే ఓ కుర్రవాడు ఏం చేస్తాడు అనేది ఈ సినిమా కథ అని హీరో తేజ సజ్జ అన్నాడు.


End of Article

You may also like