Ads
Happy Birthday Director Shankar Sir.మన దేశం లో డైరెక్టర్ శంకర్ పేరు తెలియని వారు ఉండరు అనడం లో ఎలాంటి అతియోశక్తి లేదు ఒకవేళ ఉన్నా అతడు తీసిన సినిమా ల పేరు చెబితే చాలు ఏ మూలన ఉన్నవారైనా గుర్తుపట్టేస్తారు. అది అతడి సినిమాల రేంజ్. వసూళ్ల పరంగా బాహుబలి అంతటి రేంజ్ ఉన్న సినిమాలేవీ డైరెక్టర్ శంకర్ కి లేకపోవచ్చు గాని కథ, సాంకేతికత లో అతడి ప్రతి సినిమా బాహుబలే.
Video Advertisement
శంకర్ 1993 లో వచ్చిన జెంటిల్ మెన్ సినిమా తో డైరెక్టర్ గా మారాడు. అక్కడి నుండి మొన్నటికి మొన్న వచ్చిన రోబో 2.o వరకు సిల్వర్ స్క్రీన్ మీద అన్ని మాగ్నమ్ ఓపస్ లే అందిచ్చాడు. . అది అతడి స్టామినా.
శంకర్ తన సినిమాల్లో సమకాలీన సామాజిక అంశాలను తీసుకుని వాటికి పక్కా కమెర్షియల్ టచ్ ఇస్తాడు. జెంటిల్ మెన్, భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, రోబో ఒకటేమిటి అతడి ప్రతి సినిమాలో సూపర్ మెసేజ్ ఉంటుంది.
ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాతో బిజీ గా ఉన్న శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో త్వరలో తెలుగు లో ఒక స్ట్రెయిట్ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా కు దిల్ రాజు నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు.
ఇవాళ శంకర్ 57 వ పుట్టిన రోజు ఈ సందర్బంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాము.
డైరెక్టర్ శంకర్ August 17 న 1963 లో తమిళ నాడు లోని కుంభకోణం లో జన్మించాడు.
End of Article