ఆదికేశవ మూవీలోని ఈ సీన్ చూశారా..? ఆ హిట్ మూవీ నుండి కాపీ చేశారా..?

ఆదికేశవ మూవీలోని ఈ సీన్ చూశారా..? ఆ హిట్ మూవీ నుండి కాపీ చేశారా..?

by kavitha

ఉప్పెన, కొండ పొలం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన మూడవ సినిమా “ఆదికేశవ”. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.

Video Advertisement

టీజర్, ట్రైలర్స్, పాటలు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఆదికేశవ చూసిన నెటిజెన్లు, ఇక సీన్ ను ఆ హిట్ మూవీ నుండి కాపీ చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ సీన్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆదికేశవ. ఈ మూవీలో మలయాళ యాక్టర్ జోజు జార్జ్, రాధిక, తనికెళ్ళ భరణి, సుధాకర్, రచ్చ రవి వంటివారు కీలక పాత్రలలో నటించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన  పాటలకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ కాపీ సన్నివేశాలని గమనించారు. ఆ విషయాన్ని వీడియోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు మూవీలోని ఫ్లాష్ బ్యాక్ యాక్సిడెంట్ సీన్ ను ఆదికేశవ మూవీలో ఉపయోగించారు. దీంతో రెండు సినిమాలలో సీన్స్ నెట్టింట్లో షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజెన్లు తమ దైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదే దూకుడు సీన్ ను గల్లీ రౌడీ అనే మూవీలో కూడా ఉపయోగించారని మరో నెటిజెన్ కామెంట్ చేశారు.

Also Read: “విలాసవంతమైన బంగ్లా” నుండి… “కోట్ల ఖరీదైన కార్” వరకు.. పవర్ స్టార్ “పవన్ కళ్యాణ్” దగ్గర ఉన్న 10 ఖరీదైన వస్తువులు..!


You may also like

Leave a Comment