Ads
‘కాంతార’.. గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న కన్నడ చిత్రం. భాష తో సంబంధం లేకుండా ప్రతి చితా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది చిత్రం. హీరో గా.. దర్శకుడిగా రిషబ్ శెట్టి చేసిన అద్భుతానికి అన్ని భాషల్లో మంచి స్పందన వస్తోంది. మరుగున పడిపోతున్న కళలకి దృశ్యరూపం ఇచ్చిన రిషబ్ శెట్టి పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Video Advertisement
ఈ మధ్య అందరూ సో సో గా ఉన్న సినిమాలను కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం మాత్రం రీజినల్ చిత్రం గా విడుదలై కన్నడ లో హిట్ కొట్టిన తర్వాత అందరూ డిమాండ్ చెయ్యడం తో ఇతర భాషల్లోకి అనువాదం చేసి విడుదల చేసారు.
అయితే ఈ చిత్రం పై ప్రశంసల జల్లు కురుస్తున్న సమయం లో.. బాహుబలి వంటి చిత్రాలు తీసిన మన తెలుగు సినిమా ఎందుకు ఇలా లేదు అంటూ విమర్శించేవారు ఎక్కువయ్యారు.తెలుగు లో సినిమా ఈ రేంజ్ లో తీసేవారు లేరా అనే కోణంలో చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంతార లో స్థానికత తో పాటు ప్రేక్షకులను రంజింపజేసే అన్ని ఎలిమెంట్స్ పుష్కలం గా ఉండటం తో ఇది అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. అయితే మన దగ్గర కూడా కాంతారా రేంజ్ లో కాకపోయినా స్థానికత, గ్రామీణ నేపథ్యం, లోకల్ సంప్రదాయాల నేపథ్యంలో కూడా అనేక సినిమాలు వచ్చి ఘన విజయం సాధించాయి. కానీ అవి టాలీవుడ్ దాటి బయటకు వెళ్లలేకపోయాయి.
#1 కేర్ ఆఫ్ కంచరపాలెం
అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి అద్భుతమైన ఎమోషన్స్ ని చూపించిన సినిమా కంచెరపాలెం.ఈ సినిమా మొత్తం కూడా ఒకే గ్రామం లో జరుగుతుంది.ఆ ఊర్లో ఉండే ప్రధాన పాత్రలు , వాటి చుట్టూ ఉండే ఎమోషన్స్ సినిమాను విజయం వైపు నడిపించాయి.ఇక ఈ చిత్రంలో క్లైమాక్ కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
#2 రంగస్థలం
ఒక ఊరిలోనే జరిగే ఎలెక్షన్స్ నేపథ్యంలో వచ్చిన సినిమా రంగస్థలం. ఈ సినిమాలు చెవిటి హీరో గా రామ్ చరణ్ నటన అద్భుతం.ఇక ఈ సినిమా విడుదల అయ్యి ఘన విజయం సాధించింది.
#3 1978 పలాస
ఈ చిత్రం కూడా చాల తక్కువ బడ్జెట్ తెరకెక్కి మంచి సినిమా అనిపించుకుంది.కానీ ఈ సినిమాకు సరైన ప్రమోషన్ లభించకపోవడం తో పెద్దగా ఎవరు నోటిస్ చేయలేదు కానీ, ఎంతో ఎమోషనల్ సీన్స్ ఉంది ప్రేక్షకులు మెచ్చిన సినిమా పలాస.సినిమాలోని ప్రతి సీన్ కూడా రియలిస్టిక్ గా ఉండేలా చూసుకోవడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
#4 మల్లేశం
తెలంగాణ కల్చర్ ని కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా మల్లేశం. నేతన్న కష్టాలను చుడుతూ అద్భుతమైన ఎమోషన్స్ తో అందరిని మనసులను కట్టిపడేసింది.ఈ చిత్రం విజయం సాధించడానికి ముఖ్య కారణం లోకల్ గా ఉండే మన నేతన్న సమస్యలే. సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమాలోని అన్ని పాత్రలతో కనెక్ట్ అవుతారు.
End of Article