Ads
“తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్ట నేమి వాడు గిట్టనేమి” అనే వేమన పద్యం అందరికీ తెలిసిందే..
Video Advertisement
పిల్లల్ని కని, పెంచి ఓ ప్రయోజకుల్ని చేసే వరకు తల్లిదండ్రులు వారిని కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ పిల్లల మాత్రం వారికి రెక్కలు రాగానే గూటి నుంచి పక్షి ఎగిరి పోయినట్టూ.. ఇంటి నుంచి విదేశాలకు వెళ్లాడమో లేదా ఇంట్లో ఉన్నా తల్లిదండ్రులను వృద్దాశ్రమాల్లో వేయడమో చేస్తుంటారు. చాగంటి కోటేశ్వరరావు చెప్పిన అలాంటి హృదయ విదారక కథే ఇది.
ఒకరోజు ఓ వ్యక్తి వృద్ధాశ్రమానికి వెళ్లాడు. అతను ఆశ్రమంలోకి ప్రేవేశించేప్పుడు ఆనందంగా ఉన్న ఓ వృద్ధురాలిని చూసాడు. ఆమె తన సామాను బ్యాగ్‌తో గేట్ వద్ద కూర్చొని ఉంది. ఆమె బహుశా తన పిల్లల వద్దకు వెళ్తుందేమో అందుకే అంత సంతోషంగా ఉంది అనుకున్నాడు.
రోజంతా అక్కడి వారితో గడిపి సాయంత్రం ఇంటికి వెళ్తుండగా ఆమె ఇంకా అక్కడే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు .
అనంతరం వృద్ధాశ్రమ సంక్షేమ అధికారిని ఇలా అడిగారు..
అతను: ఆ వృద్ధురాలు ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఎందుకు కూర్చుంది? ఆమెకు ఏమైంది?
కేర్ టేకర్: సార్, ఆమెకు 40 ఏళ్లు వచ్చే వరకు పిల్లలు లేరు. ఆమె అందరి దేవుళ్లను ప్రార్ధించింది. చివరకు ఆమె 40 సంవత్సరాల వయస్సులో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.
భార్యాభర్తలిద్దరు తమ ఒక్కగానొక్క కొడుకును అల్లారు ముద్దుగా పెంచారు. ఇప్పుడు ఆ కొడుకు సొసైటీలో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్నాడు. ఒకరోజు ఆవిడ భర్త అకస్మాత్తుగా మరణించాడు. ఆమె కొడుకు తన తల్లి అవసరం లేదని భావించాడు.
ఒకరోజు ఆమె కొడుకు ఈ వృద్ధాశ్రమానికి వచ్చి ఇలా చెప్పాడు.. మా అమ్మ ఇక్కడికి వచ్చి ఆమె పేరు చెబుతుంది, మీరు ఆమెను ఈ ఆశ్రమంలో చేర్చుకోండి. ఇప్పుడు నేను ఆమె పేరును ఇక్కడ నమోదు చేస్తున్నాను. నాకు ముఖ్యమైన పని ఉన్నందున నేను ఆమెతో రావచ్చు, రాకపోవచ్చు అన్నాడు.
ఆ తర్వాత కొడుకు తన తల్లితో కలిసి కారులో వచ్చి ఇలా అన్నాడు.. అమ్మా ఇది ఒక రకమైన గుడి, అక్కడ చాలా మంది ఉన్నారు. మీరు లోపలికి వెళ్లి, అన్ని పండ్లను వారికి ఇచ్చి, వారితో కొంత సమయం గడపండి, నేను ఈలోగా తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆమె లోపలికి వచ్చి అక్కడున్న వారందరికీ పండ్లు అందజేసింది. వారు (వృద్ధాశ్రమంలో ఉన్నవారు) ఆమె చేరడంలో భాగంగా అందరికీ పండ్లు అందజేస్తున్నట్లు భావించారు. అప్పుడు నేను (కేర్ టేకర్) ఆమెకు గది మరియు మంచం చూపించాను. ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యి ఇలా అడిగారు.
వృద్ధురాలు: మీరు నాకు మంచం ఎందుకు చూపిస్తున్నారు?
కేర్ టేకర్: మీ అబ్బాయి మిమ్మల్ని ఇక్కడ చేర్చాడు.
అప్పుడు ఆమె (వృద్ధురాలు) షాక్ అయ్యి కింద పడిపోయింది. ఆమె గట్టిగా అరవడం ప్రారంభించింది, అర్థరాత్రి వరకు చాలా ఏడ్చింది. రోజూ ఉదయాన్నే లేచి తయారై సామాను తీసుకుని గేటు ముందు కూర్చుంటుంది. సాయంత్రం వరకు అక్కడే ఉండి, ఆపై ఏడవడం ప్రారంభింస్తుంది, తనను తాను కొట్టుకుంటుంది చివరికు ఆమె పిచ్చిగా మారిపోయింది.
ఆమె పరిస్థితిని చూసి నేను (కేర్ టేకర్) ఆమె కొడుక్కి కాల్ చేయడానికి ప్రయత్నించాను, కానీ ఆమె కొడుకు రిజిస్ట్రేషన్ ఫారమ్ లో నకిలీ చిరునామా మరియు నకిలీ కాంటాక్ట్ నంబర్ ఇచ్చాడు. వృద్ధాశ్రమంలో ఎవరైనా తన కొడుకు గురించి మాట్లాడితే (చెడుగా) ఆమె వారిని కొడుతుంది. ఆమెకు తన కొడుకుపై అమితమైన ప్రేమ ఉంది. కానీ కొడుకు ఆమెను మోసం చేసి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. నిజజీవితంలోని ఈ హృదయ విదారక కథ చెప్పడం పూర్తయ్యాక చాగంటి గారు ఇలా అన్నారు.. దయచేసి మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి, వారి అమూల్యమైన కృషి, ఎనలేని ప్రేమ వల్లే నేడు మనం ఈ స్థితిలో ఉన్నాము.
End of Article