ఆచార్య చాణిక్యుడు తన విధానాల ద్వారా ఎంతోమందికి పరిజ్ఞానం, విజ్ఞానం తరహా విషయాలను చాణక్య నీతి ద్వారా తెలియజేశారు. దీని ఆధారంగా వ్యక్తులను మూడు రకాలుగా విభజించి వీరికి సహాయం చేస్తే మనకు సమస్యలు ఏర్పడతాయని తెలియజేశారు. మరి వారెవరో తెలుసుకుందామా..?

Video Advertisement

చెడు గుణం కలిగిన వ్యక్తి :ఆచార్య చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం చెడు గుణం ఉన్న వ్యక్తిని మనం పసిగట్టి ముందుగానే వారికి దూరంగా ఉండటం మంచిది. అలాంటివారికి మనం ఏ సాయం చేసినా మనకి సమస్యలు ఏర్పడతాయని ఆయన తెలియజేశారు. అలాంటి వారితో పరిచయం కూడా మనకు ప్రమాదంగా మారుతుందని అందుకే అలాంటి వారికి దూరంగా ఉండాలి.

చెడు వ్యసనాలు ఉన్నవారు :మాదక ద్రవ్యాలు మరియు నిద్ర మత్తు పదార్థాలకు అలవాటు పడి మత్తుకు బానిస అయిన వారికి మనం దూరంగా ఉండాలని చాణక్య చెప్పారు. మత్తులో ఉన్నటువంటి వ్యక్తి తప్పు, ఒప్పులను గుర్తించలేకపోతారని అందుకే అలాంటి వారికి దూరంగా ఉండాలని చాణక్యుడు అన్నారు.

విచార వ్యక్తి :ఇలాంటి వారు జీవితంలో ఏది వచ్చినా తృప్తి చెందారు. కాబట్టి ఇలాంటి వారితో దూరంగా ఉండాలని చాణక్యుడు తెలిపారు. వీరికి సాయం చేసిన మనమే బాధపడాల్సి వస్తుంది. వీరికి ఎంత మంచి సహాయం చేసిన అసంతృప్తితోనే ఉంటారు. కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉండాలని చాణిక్యుడి తెలిపారు.