31 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు కలిసి నటిస్తున్నారు..! ఇంతకీ వీళ్ళు ఎవరో గుర్తుపట్టారా..?

31 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు కలిసి నటిస్తున్నారు..! ఇంతకీ వీళ్ళు ఎవరో గుర్తుపట్టారా..?

by Mohana Priya

Ads

ఒక సినిమాలో హీరో పక్కన హీరోయిన్ చాలా ముఖ్యం. అంటే ఈ మధ్యకాలంలో హీరోయిన్ లేకుండా కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ చాలా సినిమాల్లో మాత్రం హీరోయిన్ హీరో పక్కన ఉండాల్సిందే. అంతే కాకుండా, ఆ హీరోయిన్ హీరో పక్కన చూడడానికి కూడా బాగా కనిపించాలి. హీరోకి సూట్ అయ్యేలాగా హీరోయిన్ ఉండాలి. ఒక సినిమా హిట్ అయితే, ఆ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు తర్వాత మళ్లీ కలిసి నటిస్తూ ఉంటారు. వాళ్ళని హిట్ కాంబినేషన్ అని అంటారు. అలా ఒక హీరో, ఒక హీరోయిన్ 31 సంవత్సరాల తర్వాత కలిసి ఇప్పుడు ఒక సినిమాలో నటించారు.

Video Advertisement

hero and heroine acting in same movie after 31 years

కానీ ఈ సినిమాలో వాళ్ళ పాత్రలు ఎలా ఉంటాయి అనేది మాత్రం తెలియదు. రాజేంద్రప్రసాద్, శోభన. వీళ్ళిద్దరి పేరు వింటే మనకి మొదటిగా గుర్తొచ్చే సినిమా ఏప్రిల్ ఒకటి విడుదల. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతో పెద్ద విజయం సాధించింది. శోభనని తెలుగు వారికి ఇంకా చేరువ చేసింది. ఈ సినిమా తర్వాత రాజేంద్రప్రసాద్, శోభన కలిసి అప్పుల అప్పారావు, మైనర్ రాజా, కన్నయ్య కిట్టయ్య సినిమాల్లో కూడా నటించారు. దాంతో హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. కన్నయ్య కిట్టయ్య 1993 లో వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళు తర్వాత కలిసిన నటించలేదు. ఇప్పుడు మళ్లీ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమాలో వీళ్ళిద్దరూ కనిపిస్తున్నారు. మరి వీళ్ళిద్దరి పాత్రలు ఏంటి అనేది ఇంకా తెలియదు.

కానీ 31 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం చూసి సోషల్ మీడియాలో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శోభన తెలుగు సినిమాల్లో నటించి చాలా కాలం అయ్యింది. చివరిగా శోభన తెలుగులో 2006 లో వచ్చిన గేమ్ సినిమాలో నటించారు. మళ్లీ ఇప్పటి వరకు తెలుగు సినిమాలో నటించలేదు. 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కల్కి సినిమాలో నటించారు. ఈ సినిమాలో శోభన మరియం అనే పాత్రలో నటించారు. దీపికా పదుకొనేతో పాటు శోభన కూడా కనిపిస్తున్నారు. మరి శోభన పాత్ర ఏంటి అనేది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.


End of Article

You may also like