హీరో అర్జున్ ఫ్యామిలీ నుండి ఇంతమంది హీరో హీరోయిన్లు ఉన్నారా.? అన్నయ్య, కూతురు, ముగ్గురు మేనల్లుళ్లు.!

హీరో అర్జున్ ఫ్యామిలీ నుండి ఇంతమంది హీరో హీరోయిన్లు ఉన్నారా.? అన్నయ్య, కూతురు, ముగ్గురు మేనల్లుళ్లు.!

by Anudeep

Ads

హీరో అర్జున్ వాస్తవానికి తమిళ నటుడు అయినా, తెలుగు నాట కూడా అర్జున్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అర్జున్ దాదాపు 130 సినిమాలలో నటించాడు. “మా పల్లెలో గోపాలుడు” సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అర్జున్ “జెంటిల్ మెన్”, “శ్రీ మంజునాథ” సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత గా చేరువయ్యాడు. హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రా చెల్లి, శ్రీఆంజనేయం, స్వాగతం, రామ రామ కృష్ణ కృష్ణ వంటి సినిమాలతో అర్జున్ తెలుగునాట తిరుగులేని నటుడు గా పేరు తెచ్చుకున్నాడు. హీరో గానే కాకుండా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అర్జున్ కు మంచి పేరు ఉంది.

Video Advertisement

అర్జున్ అసలు పేరు శ్రీనివాస్ సర్జా.. సినిమాలలోకి వచ్చిన తరువాత అర్జున్ సర్జా గా మారింది. అర్జున్ హనుమంతుడు కి భక్తుడు. శ్రీ ఆంజనేయం సినిమాలో అర్జున్ హనుమంతుని పాత్రను పోషించాడు. అర్జున్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐశ్వర్య సర్జా, మరియు అంజనా సర్జా. అయితే, తెలుగు నాట అర్జున్ ఎంత ఫెమస్సో ఇతర భాష ల ఫిలిం ఇండస్ట్రీలలో అర్జున్ ఫామిలీ అంత ఫేమస్. అర్జున్ ఫామిలీ లో చాలా మంది ఫిలిం ఇండస్ట్రీ లోనే సెట్టిల్ అయ్యారు. తమ నటన ప్రభావం తో సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వారు ఎవరో ఇప్పుడు ఎక్కడ నటిస్తున్నారో తెలుసుకుందాం.

arjun sarjaa family 2

అర్జున్ నేటివ్ ప్లేస్ కర్ణాటక. అర్జున్ తండ్రి శక్తి ప్రసాద్ కన్నడ లో ఫేమస్ విలన్. అర్జున్ భార్య ఆశా రాణి ఒకప్పుడు కన్నడ లో ఫేమస్ హీరోయిన్. అర్జున్ అన్నయ్య కిషోర్ సర్జా కన్నడ ఫేమస్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆయన ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేశారు. ఆయన ఇటీవల కాన్సర్ వ్యాధి తో బాధపడుతూ చనిపోయారు.

అర్జున్ కు ముగ్గురు మేనల్లుళ్లు వున్నారు. వీరు కూడా కన్నడ లో యంగ్ స్టార్స్ గానే ఉన్నారు. చిరంజీవి సర్జా కన్నడ లో యంగ్ హీరో. ఇతను కన్నడ లో 22 సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే, కరోనా లాక్ డౌన్ సమయం లో చిరంజీవి సర్జా  మరణించారు.. వాయుపుత్ర సినిమా తో తెరంగ్రేటం చేసిన చిరంజీవి సర్జా పలు తెలుగు, తమిళ సినిమాలను రీమేక్ చేసాడు.

అతని తమ్ముడు ధ్రువ సర్జా అద్దూరి సినిమా తో తెరంగ్రేటం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. మూడవ మేనల్లుడు భరత్ సర్జా పులకేశి సినిమా తో తెరంగ్రేటం చేసి మంచి నటుడి గా పేరు సంపాదించుకున్నాడు. విభిన్నమైన కధలు ఎంచుకుంటూ నటుడి గా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

sarja brothers

ఇంకా అర్జున్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఐశ్వర్య, అంజనా అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఐశ్వర్య సర్జ తమిళనాట హీరోయిన్. ఆమె హీరో విశాల్ తో పట్టత్తు అనే సినిమా తో తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా తెలుగు లో కూడా “ధీరుడు” పేరుతొ అనువాదం అయింది. ఈ సినిమా తరువాత ఐశ్వర్య మరే సినిమాను చేయలేదు. అర్జున్ సర్జా కుటుంబం లో అందరు నటీనటులే.. అందరు తమిళ, కన్నడ, తెలుగు నాట కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి సినిమాలతో సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు.


End of Article

You may also like