తెలుగు తోపాటుగా తమిళం లో కూడా పలు విజయవంతమైన సినిమాలలో నటించిన హీరో ‘సిద్దార్థ్’ పై గత కొంత కాలంగా ఆయన పై కొన్ని అసత్య ప్రచారాలు , కొన్ని ప్రచురణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయన మరణించారు, ఇక లేరు RIP అంటూ గతం లో వార్తలు వైరల్ అవ్వడం అది కాస్త హీరో సిద్దార్థ్ వరకు వెళ్లడం, వాటిపైన ఆయన ఘాటుగా స్పందించడం వంటివి జరిగాయి. అంతే కాదు  అలా వార్త ప్రచురించిన వారిపైన చర్యలు తీసుకుంటానంటూ కూడా హెచ్చరించారు. ఆ వార్తని ప్రచురించిన వారు కూడా తప్పు జరిగిపోయిందంటూ క్షమాపణలు కూడా చెప్పారు.

hero-siddarth

hero-siddarth

అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ అయన పై అలాంటి పోస్ట్లు పెట్టడం ఆయనని కలచివేసింది. మరో మారు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అసలు వివరాల్లోకి వెళితే నిన్న ఉదయం బిగ్ బాస్ విజేత, బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ శుక్ల మరణించిన వార్త తెలిసిందే కానీ ఆయన ఫోటో కి బదులుగా హీరో సిద్దార్థ్ ఫోటో ని జత చేస్తూ పోస్ట్ చేసారు కొందరు. ఇలా ఈ సంఘటన హీరో సిద్దార్థ్ ని బాధపెట్టింది.

ఇక చాల కాలం తరువాత హీరో సిద్దార్థ్ హీరోగా తెలుగు లో ఒక సినిమా రానుంది ‘మహా సముద్రం’ అనే సినిమా లో హీరో శర్వానంద్ తో పాటుగా సిద్దార్థ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి Rx 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:  హీరోలకు అక్కాచెల్లెళ్లుగా నటించిన 14 మంది హీరోయిన్లు…! “సమంత” కి అన్నగా నటించిన హీరో ఎవరో తెలుసా.?