మన సినిమా ఇండస్ట్రీలో తల్లిదండ్రుల వారసత్వంతో వచ్చిన కొడుకులు, కూతుర్లు ఎంతో మంది ఉన్నారు. అలాగే సోదరీ సోదరులు హీరో హీరోయిన్లు అయ్యి ఉండి, తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన ఎంతో మంది నటులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు నగ్మా, జ్యోతిక, రోషిని. ఈ ముగ్గురు సొంత అక్కా చెల్లెళ్ళు కాకపోయినా కూడా హాఫ్ సిస్టర్స్ అవుతారు.

sisters in movie industry

నగ్మా ఒక సమయంలో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఇలా టాప్ హీరోలందరితోనూ నటించారు. కేవలం ఒక్క సినిమాలో మాత్రమే కాకుండా ప్రతి హీరోతో దాదాపు రెండు సినిమాల్లో లేదా అంతకంటే ఎక్కువ సినిమాల్లో నటించారు నగ్మా.

Hero who acted with nagma Jyothika and roshini

తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో రజినీకాంత్ గారితో బాషా సినిమాలో కూడా హీరోయిన్ గా నటించారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో తమిళ్, తెలుగుతో పాటు ఇతర భాషా సినిమాల్లో కూడా నటించారు. ఇంక జ్యోతిక కూడా తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించారు.

Hero who acted with nagma Jyothika and roshini

వీరిద్దరి సోదరి పేరు రోషిని. రోషిని కూడా నటే. అయితే వీరు ముగ్గురు కామన్ గా నటించిన హీరో ఒకరు ఉన్నారు. ఆయన మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవితో నగ్మా రిక్షావోడు తో పాటు మరో రెండు, మూడు సినిమాల్లో నటించారు. జ్యోతిక చిరంజీవితో ఠాగూర్ సినిమాలో నటించారు.

Hero who acted with nagma Jyothika and roshini

వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోయిన్ గా కనిపిస్తారు జ్యోతిక. రోషిని నటించింది కొన్ని సినిమాలే. అందులో చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ సినిమా ఒకటి. ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోయిన్ గా నటించారు రోషిని. అలా ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లతో నటించి ఒక అరుదైన రికార్డు అందుకున్నారు చిరంజీవి.