రాజమౌళితో సినిమా చేశాక కూడా హీరోగా ఎదగలేకపోయిన ఒకే ఒక్క నటుడు ఇతనేనా..? ఎవరంటే..?

రాజమౌళితో సినిమా చేశాక కూడా హీరోగా ఎదగలేకపోయిన ఒకే ఒక్క నటుడు ఇతనేనా..? ఎవరంటే..?

by Harika

Ads

సాధారణంగా కొంత మంది డైరెక్టర్లతో సినిమాలు చేస్తే ఒక గుర్తింపులాగా ఫీల్ అవుతారు. చాలా మందికి ఆ డైరెక్టర్ తో పని చేయాలి అనే ఆశ ఉంటుంది. ఆ నటులకి ఆ ఆశ నెరవేరినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్లతో పని చేశాక కెరీర్ పరంగా కూడా చాలా వరకు ఎదుగుతారు. ఎంతో మంది నటులు పనిచేయాలి అనుకునే డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. రాజమౌళి సినిమాలో ఒక్క చిన్న పాత్ర అయినా చేస్తే చాలు అని అనుకునే వాళ్ళు ఎంతోbమంది ఉంటారు. వాళ్లలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు కూడా ఉన్నారు.

Video Advertisement

rajamouli-mahesh babu movie updates

అయితే, ఒక హీరో మాత్రం రాజమౌళితో సినిమా చేశాక కూడా కెరీర్ పరంగా అంత గుర్తింపు పొందలేకపోయారు. అది కూడా హీరోగా మాత్రమే గుర్తింపు పొందలేకపోయారు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేయడం కూడా ఆపేశారు. సునీల్ రాజమౌళితో మర్యాద రామన్న సినిమా చేశారు. సలోని ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. సునీల్ హీరోగా నటించిన కొన్ని సినిమాలలో అత్యధిక వసూళ్లు సంపాదించిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. సునీల్ మర్యాద రామన్న సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చాలా సన్నగా అయ్యారు. కానీ మర్యాద రామన్న సినిమా తర్వాత సునీల్ నటించిన చాలా సినిమాలు ఆశించిన ఫలితాలు పొందలేదు.

ఆ సినిమా సునీల్ కి ఒక హీరో ఇమేజ్ తీసుకొచ్చింది. దాంతో ఆ సమయంలో కమెడియన్ రోల్స్ చేయడం కూడా కష్టంగా మారింది. అందుకే ఎక్కువ హీరో పాత్రలు ఎంచుకుంటూ వచ్చారు. పూలరంగడు వంటి సినిమాలు హిట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత హీరోగా ఎన్నో సినిమాలు వచ్చాయి. దాంతో అవి ఏమీ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, సునీల్ కొంత కాలం గ్యాప్ తీసుకున్నారు. ఇటీవల అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో, డిస్కో రాజా, పుష్ప సినిమా తర్వాత మళ్లీ సినిమాలు చేస్తూ వస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సునీల్ సినిమాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు హీరోగా కనిపిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

ALSO READ : “ఆడవాళ్ళ” కి మాత్రమే కాదు… “మగవాళ్ళ” కి కూడా సమస్యలు ఉంటాయి అని చూపించిన 9 సూపర్ హిట్ సినిమాలు..!


End of Article

You may also like