ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ తో ఉన్న అబ్బాయి… ఇప్పుడు పెద్ద స్టార్ హీరో అయ్యారు..! ఎవరో కనిపెట్టగలరా..?

ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ తో ఉన్న అబ్బాయి… ఇప్పుడు పెద్ద స్టార్ హీరో అయ్యారు..! ఎవరో కనిపెట్టగలరా..?

by Mohana Priya

Ads

వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. అలా వారసత్వంతో వచ్చినా కూడా, తర్వాత ఎంతో కష్టపడి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. స్టార్ హీరోలుగా ఎదిగారు. వీరిలో చెప్పుకోవాల్సిన వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ ఇప్పుడు పవర్ స్టార్ గా ఎదిగారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. అయితే, పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాల్లో ఉంటూనే, మరొక పక్క సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ విరామం లేకుండా షూటింగ్ చేస్తారు.

Video Advertisement

hero with pawan kalyan is also a hero

వీటిలో ఒక సినిమా ఈ సంవత్సరం విడుదల అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆ సినిమా ఏది అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ పైన ఫోటోలో ఉన్నది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తో పాటు ఒక బాబు కూడా ఉన్నారు. ఆ బాబు ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆయన ఎవరో ఈపాటికి మీలో చాలా మందికి అర్థం అయిపోయి ఉంటుంది. ఆయనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ చిన్నగా ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇది. ఈ ఫోటోలో రామ్ చరణ్ ని పవన్ కళ్యాణ్ ఆశీర్వదిస్తున్నారు. రామ్ చరణ్ కూడా మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ తర్వాత తన కృషితో ఇప్పుడు ఇంత గొప్ప స్థాయికి ఎదిగారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబు దర్శకత్వంలో వచ్చే సినిమాలో కూడా నటిస్తారు. ఆ తర్వాత సుకుమార్ తో మరొక సినిమా చేస్తారు. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రంగస్థలం సినిమా వచ్చి చాలా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అనేటప్పటికి అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఆ తర్వాత రామ్ చరణ్ ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. ప్రస్తుతం అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రాబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనిలో బిజీగా ఉన్నారు.


End of Article

You may also like