సావిత్రి గారితో ఉన్న ఈ అబ్బాయి యూనివర్సల్ హీరో అయ్యారు..! ఎవరో కనిపెట్టగలరా..?

సావిత్రి గారితో ఉన్న ఈ అబ్బాయి యూనివర్సల్ హీరో అయ్యారు..! ఎవరో కనిపెట్టగలరా..?

by Mohana Priya

Ads

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క జర్నీ. కొంత మంది నటులు పెద్దయ్యాక ఇండస్ట్రీలోకి వస్తారు. కొంత మంది నటులు చిన్నప్పుడు సినిమాల్లో నటించి, ఆ తర్వాత కొంత విరామం తీసుకొని, మళ్లీ సినిమాల్లోకి వస్తారు. కానీ కొంత మంది నటులు మాత్రం, చిన్నప్పటినుండి పెద్ద అయ్యేంత వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా, లీడ్ పాత్రల్లో, సహాయ పాత్రల్లో, ముఖ్య పాత్రల్లో, అలా తమ వయసుకి సూట్ అయ్యే పాత్రల్లో నటిస్తూ వెళ్తూ ఉంటారు.

Video Advertisement

hero with savitri

అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి వారు ప్రేక్షకులకు చాలా బాగా చేరువవుతారు. వారి భాషల ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతర భాషల ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు పైన ఫోటోలో ఉన్న అబ్బాయి కూడా చాలా పెద్ద హీరో అయ్యారు. సావిత్రి గారితో ఉన్న ఈ బాబు ఎవరో గుర్తుపట్టారా? కమల్ హాసన్ తెలియని వారు ఉండరు. కమల్ హాసన్ తమిళ్ వారు. కానీ తెలుగులో కమల్ హాసన్ కి వీరాభిమానులు ఉన్నారు. ఆయన నటించిన స్వాతిముత్యం, సాగర సంగమం సినిమాలని ఇష్టపడేవారు ఎంతో మంది ఉంటారు. ఆయన నటన చాలా మందికి టెక్స్ట్ బుక్ లాంటిది. కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ పలికించే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో కమల్ హాసన్ ముందుగా మాట్లాడుకునే నటుడు.

విక్రమ్ సినిమాకి ముందు కమల్ హాసన్ బర్త్ డే రోజు ఒక వీడియో విడుదల చేశారు. అందులో కమల్ హాసన్ కళ్ళతోనే ఒక ఎక్స్ప్రెషన్ పలికిస్తారు. వీడియో విడుదల అయ్యాక ఆ ఎక్స్ప్రెషన్ గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే అసలు కమల్ హాసన్ పాత్ర సినిమాలో ఎలా ఉంటుంది అనే విషయం తెలిసిపోతుంది. కమల్ హాసన్ మంచి నటుడు మాత్రమే కాదు. గాయకుడు, నృత్య కళాకారుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా. దశావతారం సినిమాలో కమల్ హాసన్ నటన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అలాంటి సాహసం చేయాలి అనే ఆలోచన రావడమే చాలా గొప్ప. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో నటించారు. ఈ సినిమా భారతీయుడు 2 పేరుతో తెలుగులో కూడా విడుదల అవుతుంది.


End of Article

You may also like