ఈ ఫోటోలో ఉన్న వారిలో ఇద్దరు హీరోలు ఉన్నారు..! ఎవరో కనిపెట్టగలరా..?

ఈ ఫోటోలో ఉన్న వారిలో ఇద్దరు హీరోలు ఉన్నారు..! ఎవరో కనిపెట్టగలరా..?

by Mohana Priya

Ads

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉంటారు. వారిలో కొంత మంది సినిమాల్లోకి వచ్చాక, కలిసి ఏదైనా సినిమాకి పని చేసినప్పుడు స్నేహితులవుతారు. కొంత మంది మాత్రం ఇండస్ట్రీకి రాకముందు నుండే స్నేహితులుగా ఉంటారు. సినిమా అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నప్పుడు అలా స్నేహితులవుతారు. కొంత మంది బంధువుల ద్వారా తెలిసినవారు అయితే వారు స్నేహితులవుతారు. కానీ కొంత మంది మాత్రం స్కూల్ సమయంలోనే స్నేహితులుగా ఉంటారు. ఆ తర్వాత వాళ్లు సినిమాల్లోకి వస్తారు.

Video Advertisement

heroes in this picture

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక ఇంకా మంచి స్నేహితులు అవుతారు. ఎన్నో సంవత్సరాలు వాళ్ల స్నేహం కొనసాగుతుంది. ఈ పైన ఫోటోలో ఉన్నవాళ్లు చదువుకునే సమయంలో స్నేహితులు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ఎన్నో సినిమాలు చేశారు. అలా ఎన్నో సంవత్సరాలు వీరి స్నేహం కొనసాగింది. ఈ ఫోటోలో సూపర్ స్టార్ కృష్ణ గారు, మురళీమోహన్ గారు ఉన్నారు. వీళ్లిద్దరూ ఏలూరులో ఉన్న సర్ సి రామలింగారెడ్డి కాలేజ్ లో కలిసి చదువుకున్నారు. 1958 నుండి 1960 బ్యాచ్ లో బిఎస్సి ఫిజిక్స్ వీళ్ళు చదువుకున్నారు. ఇందులో కింద నుండి రెండవ వరుసలో, కుడివైపు నుండి నాలుగవ వ్యక్తి కృష్ణ గారు అయితే, పై వరుసలో ఎడమవైపు నుండి ఆరవ వ్యక్తి మురళీమోహన్ గారు.

heroes in this picture

వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. సినిమాల బయట కూడా వీరి స్నేహం చాలా బలంగా ఉండేది. దాదాపు 60 సంవత్సరాల పైన వీరి స్నేహం కొనసాగింది. కృష్ణ గారు సినిమాల్లో హీరోగా నటించి, ఆ తర్వాత నిర్మాణరంగంలో కూడా అడుగు పెట్టారు. కానీ ఎక్కువ నటుడిగానే కొనసాగారు. కొన్ని సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు. మరొక పక్క మురళీమోహన్ గారు ఎన్నో సినిమాల్లో హీరోగా, ముఖ్య పాత్రల్లో నటించారు. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద ఎన్నో సినిమాలు నిర్మించారు కూడా. మురళీమోహన్ గారు నిర్మించిన సినిమాల్లో అతడు సినిమా కూడా ఒకటి. వ్యాపారవేత్తగా కూడా మురళీమోహన్ రాణిస్తున్నారు. జయభేరి పేరు మీద కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా ఉంది. ఈ కన్స్ట్రక్షన్ వ్యవహారాలు కూడా మురళీమోహన్ గారు చూసుకుంటున్నారు.

ALSO READ : 2018 లో ఈ మాట చెప్పాడు… 6 సంవత్సరాల తర్వాత నిజం చేశాడు..! ఎవరు ఈ ప్లేయర్..?


End of Article

You may also like