Ads
ప్రతి ఒక్కరికి తమ మొదటి జీతం అందుకోవడం అనేది అద్భుతమైన క్షణం. దీనికి మన సెలెబ్రెటీలు మినహాయింపు కాదు. మొదటి జీతం, మొదటి ఉద్యోగం అందరికి ఎంతో ప్రత్యేకం.
Video Advertisement
మన స్టార్లు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు, కానీ వారు కూడా ఎక్కడో ఒకచోట తమ ప్రయాణాన్ని ప్రారంభించిన వారే.. ఇప్పుడు మన ఫెవరెట్ హీరోలు సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవారో ఇప్పుడు తెలుసుకుందాం..
#1 అమితాబ్ బచ్చన్
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సినిమాల్లోకి రాక ముందు కోల్‌కతాలోని ఓ షిప్పింగ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవారు. అక్కడ ఆయన జీతం 500 రూపాయలు.
#2 షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాల్లోకి రాక ముందు అటెండర్ గా పని చేసారు.
#3 అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ సినిమాల్లోకి వచ్చే ముందు బ్యాంకాక్ లో చెఫ్, వెయిటర్ గా పని చేసేవారు.
#4 అల్లు అర్జున్
హీరో కాకముందు అల్లు అర్జున్ యానిమేటర్‌గా, డిజైనర్‌గా పనిచేశాడు. రూ. 3,500 అతని మొదటి జీతం.
#5 సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చిన్న తనం నుంచి పలు పనులు చేసేవాడు. ఆయన సినిమాల్లోకి రాక ముందు గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు.
#6 విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాల్లోకి రాక ముందు ట్యూషన్స్ చెప్పేవాడు.
#7 బ్రహ్మానందం
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం సినిమాల్లోకి రాక ముందు అత్తిలి లో తెలుగు లెక్చరర్ గా చేసేవారు.
#8 మోహన్ బాబు
డైలాగ్ కింగ్ మోహన్ బాబు సినిమాల్లోకి రాక ముందు వ్యాయమ ఉపాధ్యాయుడిగా పని చేసారు.
#9 నాని
తన సహజ నటనతో తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోగా మారారు నాని. ఈయన సినిమాల్లోకి రాక ముందు ఆర్జే గా పని చేసారు.
#10 గోపీచంద్
మాచో స్టార్ గోపీచంద్ సినిమాల్లోకి రాక ముందు న్యూస్ రీడర్ గా పని చేసారు.
#11 రాహుల్ రవీంద్రన్
అందాల రాక్షసి చిత్రం తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ సినిమాల్లోకి రాక ముందు ఒక మీడియా కంపెనీ లో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్ గా చేసారు.
#12 రజనీకాంత్
మన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లోకి రాక ముందు బస్సు కండక్టర్ గా పని చేసారు.
#13 ఆది పినిశెట్టి
పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి.. సినిమాల్లోకి రాక ముందు క్రికెటర్.
#14 కమల్ కామరాజు
పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కమల్ కామరాజు ఒక ఆర్కిటెక్.
#15 సుధీర్ బాబు
తనదైన శైలిలో చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు.. మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్.
End of Article