వరస ఫ్లాపుల తర్వాత… “శృతి హాసన్” తో జతకట్టి హిట్ కొట్టిన 10 మంది హీరోలు.!

వరస ఫ్లాపుల తర్వాత… “శృతి హాసన్” తో జతకట్టి హిట్ కొట్టిన 10 మంది హీరోలు.!

by Anudeep

Ads

హీరో కమల్ హాసన్  సినీ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రుతిహాసన్. అతికొద్ది కాలంలోనే హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్  గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్ గానే కాకుండా  సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా, డాన్సర్ గా శృతి కి మంచి గుర్తింపు ఉంది.మొదట అనగనగా ఒక ధీరుడు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైది శృతిహాసన్.

Video Advertisement

హిందీ చిత్రాలతో పాటు, తెలుగులో మొదటి సినిమా అనగనగా ఓ ధీరుడు ప్లాప్ కావడంతో  ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేసుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంతో శృతి హాసన్ హిట్ ట్రాక్ లోకి వచ్చేసింది. ఈ చిత్రంతో అగ్రస్థాయి హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది శృతిహాసన్. ఈ సక్సెస్ తో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ అని కాకుండా, శృతి కి తండ్రి కమల్ హాసన్ అనే రేంజ్ కి మారిపోయింది.

sruthi hasan

శృతిహాసన్ అడుగుపెట్టడంతో ఫ్లాపులతో సతమతమవుతున్న హీరోలకు సైతం సక్సెస్ అందుకున్నాయి.  శృతి హాసన్ తో కలిసి నటించి ఫ్లాప్ నుంచి బయటపడి హిట్ దారి పట్టిన మన టాలీవుడ్ స్టార్స్ ఎవరో చూసేద్దాం రండి..

#1. పవన్ కళ్యాణ్ :

sruthi hasan gabbar singh

కొమరం పులి, తీన్మార్, పంజా ఈ మూడు చిత్రాలతో ప్లాప్స్ అందుకున్నాడు పవర్ స్టార్  పవన్ కళ్యాణ్. తర్వాత శృతి హాసన్ తో కలిసి నటించిన గబ్బర్ సింగ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

#2. మహేష్ బాబు :

sruthi hasan srimanthudu

నేనొక్కడినే, ఆగడు చిత్రాలు ఫ్లాప్. ఆ తర్వాత శృతి హాసన్ తో నటించిన శ్రీమంతుడు తో హిట్ అందుకున్నాడు మహేష్ బాబు.

#3. రామ్ చరణ్ :

తుఫాన్ సినిమాతో డిజాస్టర్ ని అందుకున్న రామ్ చరణ్, శృతి హాసన్ తో కలిసి నటించిన ఎవడు సినిమాతో హిట్ అందుకున్నారు.

#4. అల్లు అర్జున్ :

ఇద్దరమ్మాయిలు ప్లాప్. రేసుగుర్రం బ్లాక్ బాస్టర్.

#5. రవితేజ :

దరువు, నిప్పు, వీర ప్లాప్స్ అందుకున్న రవితేజ తర్వాత శృతి హాసన్ తో నటించిన బలుపు చిత్రంతో హిట్ ను సాధించారు.

#6. పవన్ కళ్యాణ్ :

vakil sab 2

సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి వంటి చిత్రాలు ఫ్లాప్స్. శృతి హాసన్ తో నటించిన వకీల్  సాహెబ్ చిత్రం హిట్.

#7. నాగ చైతన్య :

ఆటో నగర్ సూర్య, దోచేయ్ ప్లాప్స్.  ఆతర్వాత శృతిహాసన్ నటించిన ప్రేమమ్ హిట్.

#8. అజిత్ :

ఎంతవాడు కానీ ఈ చిత్రం ప్లాప్ అందుకున్న అజిత్ ఆ తర్వాత శృతి హాసన్ తో నటించిన వేదాళం చిత్రంతో హిట్ ను అందుకున్నాడు.

#9. విశాల్ :

పందెం కోడి చిత్రం తర్వాత తెలుగులో వచ్చిన విశాల్ చిత్రాలు ఫ్లాప్ ని అందుకున్నాయి. ఆ తర్వాత శృతి తో కలిసి నటించిన పూజ చిత్రంతో సక్సెస్ బాటపట్టాడు విశాల్.

#10. రవితేజ :

అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా చిత్రాలతో ప్లాప్స్ అందుకున్న రవితేజ, ఆ తర్వాత  శృతి హాసన్ తో నటించిన క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.


End of Article

You may also like