Ads
ఎంతో టాలెంట్ ఉంటే కానీ హీరోలు అవ్వలేరు. డాన్స్, నటన అన్నింటిలో కూడా టాలెంట్ ఉండాలి. అప్పుడే హీరో అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది అయితే ఎంత టాలెంట్ ఉన్నా సరే ఏదో అడ్డంకి వచ్చి కెరియర్ లో సక్సెస్ అవ్వలేరు. ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వలేరు.
Video Advertisement
నిజానికి టాలెంట్ తో పాటు లుక్ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో నిలబడగలరు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ”కాంతారా” సినిమా పేరే వినబడుతోంది. ఎందుకంటే ఇటీవల ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇందులో నటించిన రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు.
ఇది ఒక కన్నడ సినిమా. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా నటించారు. అలానే ఈ సినిమాకి దర్శకత్వం కూడా రిషబ్ శెట్టి ఏ వహించారు నిజానికి ఈ సినిమాలో రిషబ్ శెట్టి యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంది. యాక్టింగ్ చూసి చాలా మంది ఫిదా అయిపోతున్నారు. అయితే ఒక హీరో హీరో కింద నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించడం అంటే కష్టమైన పనే. కానీ ఇండస్ట్రీలో ఇదేమీ కొత్త కాదు. చాలా మంది హీరోలు హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు మరి ఆ నటుల జాబితా ఇప్పుడు చూద్దాం.
#1. రిషబ్ శెట్టి:
”కాంతారా” సినిమాకి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. పైగా హీరో కూడా ఇతనే.
#2. ధనుష్:
”పా పండి” చిత్రంకి ధనుష్ దర్శకత్వం వహించారు. పైగా హీరో కూడా.
#3. విశ్వక్ సేన్:
ఫలక్ నుమా దాస్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు మరియు నటించారు.
#4. మాధవన్:
రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’ కి ఈయనే హీరో. ఈయనే దర్శకుడు.
#5. రక్షిత్ శెట్టి:
‘ఉలిదవరు కందంతే’ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు రక్షిత్ శెట్టి. అలానే రిచర్డ్ ఆంథోనీ ని కూడా డైరెక్ట్ చేస్తున్నారట.
#6. రాజ్ బి శెట్టి:
”ఒండు మొట్టేయ కథ,” ”గరుడ గమన వృషభ వాహన” సినిమాలకు దర్శకత్వం వహించారు మరియు నటించారు.
#7. పవన్ కళ్యాణ్:
జానీ సినిమాకు హీరో, దర్శకుడు పవన్ కళ్యాణ్ ఏ.
#8. పృథ్వీరాజ్ సుకుమారన్:
‘లూసిఫర్’ కి దర్శకత్వం వహించిన ఈయన కూడా ఆ సినిమాలో ఓ కీలకమైన రోల్ చేసారు.
#9. విశాల్:
తుప్పరివాలన్2 (డిటెక్టివ్ 2) కి విశాల్ దర్శకత్వం వహించనున్నారు.
#10. అడివి శేష్:
కర్మ, కిస్ సినిమాలకు ఈయనే హీరో. ఈయనే దర్శకుడు.
End of Article