తెలుగు ఇండస్ట్రీ నుండి ఇతర భాషల్లోకి… ఇతర భాషల ఇండస్ట్రీ నుండి తెలుగులోకి అడుగుపెడుతున్న 10 హీరోస్..!

తెలుగు ఇండస్ట్రీ నుండి ఇతర భాషల్లోకి… ఇతర భాషల ఇండస్ట్రీ నుండి తెలుగులోకి అడుగుపెడుతున్న 10 హీరోస్..!

by Anudeep

Ads

ప్రస్తుతం సినిమా పరిధి విస్తరించింది. ప్రేక్షకుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. ఓటీటీ పుణ్యామా అని ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలు, అన్ని జోనర్స్ మూవీస్ చూడగలుగుతున్నారు.

Video Advertisement

దీంతో ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితమైన మన హీరోలు ఇప్పుడు పరభాషల్లోకి కూడా అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అదే విధంగా కోలీవుడ్, బాలీవుడ్ మరియు ఇతర భాషల్లోని అనేకమంది హీరోలు మన టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు.


అయితే ఈ సంవత్సరం మన తెలుగు నుంచి ఇతర భాషాల్లోకి, ఇతర భాషల్లోంచి తెలుగులోకి అడుగుపెడుతున్న హీరోలందరిపై ఓ లుక్కేద్దాం . .

#1. జూనియర్ ఎన్టీఆర్

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్” మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ తో పాటు కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ కూడా అడుగుపెట్టాడు.

#2. రవితేజ


రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన “ఖిలాడి” మూవీతో రవితేజ మొదటిసారి బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు.

#3. విజయ్ దేవరకొండ


విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో “లైగర్” సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 5 భాషల్లో విడుదల చేయనున్నారు.

#4. రామ్ పోతినేని


తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో “వారియర్” మూవీతో కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

#5.అడివి శేష్

“మేజర్” మూవీ శశి కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాతో అడివి శేష్ మొదటిసారి బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు.

#6. బెల్లంకొండ శ్రీనివాస్

తెలుగు డైరెక్టర్ వీ.వీ వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమా రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీంతో బెల్లంకొండ బాలీవుడ్ లోకి ప్రవేశించనున్నాడు.

#7. నాగ చైతన్య


అద్వైత్ చందన్ డైరెక్షన్ లో “లాల్ సింగ్ చద్దా” సినిమాతో అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ లో అడుగు పెట్టనున్నాడు.

#8. విజయ్


వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా “వారసుడు” సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

#9 ధనుష్


ధనుష్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో “సార్” సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతుంది.

#10 శివ కార్తికేయన్


అనుదీప్ కేవీ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా “ప్రిన్స్” సినిమాను రూపొందిస్తున్నారు. దీన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.


End of Article

You may also like