Ads
ఇండియా లో చాలా మూవీ ఇండస్ట్రీస్ ఉన్నప్పటికీ బాలీవుడ్ కి ఉన్న మార్కెట్ ఎక్కువ. అంతే కాకుండా చాలా కాలం వరకు ఇండియన్ సినిమా అంటే బాల్యేఊద్ మాత్రమే అని ప్రపంచం మొత్తం అనుకొనేది. అందుకే చాలా మంది హీరోలు.. హీరోయిన్లు అక్కడికి వెళ్లి స్థిర పడాలి అనుకుంటారు. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు వస్తుండటం తో బాలీవుడ్ మేనియా కాస్త తగ్గిందనే చెప్పాలి.
Video Advertisement
అయితే కొందరు హీరోలు తమ ప్రాంతీయ ఇండస్ట్రీ లో సూపర్ స్టార్స్ అయ్యాక.. బాలీవుడ్ కి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఎక్కువగా వారికీ ప్లాప్ లే ఎదురయ్యాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఉన్న హీరోలెవరో చూద్దాం..
#1 చిరంజీవి
తెలుగు ఇండస్ట్రీ లో మెగా స్టార్ గా వెలుగొందుతున్న సమయం లోనే చిరు తన బాలీవుడ్ అరంగ్రేట్రం చేసారు. తెలుగులో సూపర్ హిట్ అయిన అంకుశం ని ప్రతిబంద్ గానూ, గ్యాంగ్ లీడర్ ని బాలీవుడ్ లో ఆజ్ కా గుండా రాజ్ గానూ రీమేక్ చేసారు. తర్వాత జెంటిల్ మాన్ మూవీ కూడా రీమేక్ చేయగా అన్ని ఫ్లోప్స్ కావడం తో ఇక అటువైపు చూడలేదు చిరు.
#2 వెంకటేష్
విక్టరీ వెంకటేష్ తన హిట్ సినిమా చంటిని బాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టారు. కానీ ఆ తర్వాత యమలీల మూవీ ని బాలీవుడ్ లో రీమేక్ చేయగా ఫ్లాప్ అయ్యింది.
#3 రాంచరణ్ తేజ్
తన కెరీర్ తొలినాళ్లలోనే అమితాబ్ సూపర్ హిట్ మూవీ జంజీర్ ని రామ్ చరణ్ రీమేక్ చేయగా డిజాస్టర్ గా నిలిచింది.
#4 రానా దగ్గుబాటి
రానా దమ్ మారో దమ్ మూవీ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డల్ అయ్యింది. ఆ తర్వాత చేసిన ‘డిపార్ట్‌మెంట్’ మూవీ కూడా ఫ్లాప్ గా నిలిచింది.
#5 నితిన్
హీరో నితిన్ కూడా 2009 రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అగ్యాత్ మూవీ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది.
#6 ప్రభాస్
బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ చేసిన సాహో మూవీ బాలీవుడ్ లో కూడా రిలీజ్ అయ్యింది. కానీ ఫ్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ చిత్రం చేస్తున్నారు.
#7 నాగ చైతన్య
అక్కినేని నాగ చైతన్య.. ఆమిర్ ఖాన్ హీరోగా వచ్చిన లాల్ సింగ్ చద్దా మూవీ లో నటించారు. కానీ ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది.
#8 బెల్లంకొండ సాయి శ్రీనివాస్
అల్లుడు శీను చిత్రం తో టాలీవుడ్ హీరోగా మారిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది.
#9 విజయ్ దేవరకొండ
పూరిం జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన లైగర్ మూవీ తో విజయ్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.
#10 సూర్య
కోలీవుడ్ హీరో సూర్య రక్త చరిత్ర మూవీ తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది.
End of Article