మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. తమదైన స్టైల్ లో ప్రతి ఒక్కరూ రాణిస్తున్నారు. మన హీరోల భార్యలు కూడా హీరోలకి ధీటుగానే వాళ్ల ప్రొఫెషన్ లో దూసుకుపోతున్నారు.

Video Advertisement

వాళ్ళలో కొంత మంది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

#1 అల్లరి నరేష్ – విరూప కంఠంనేని

అల్లరి నరేష్ భార్య అయిన విరూప ఒక ఆర్కిటెక్ట్. అంతే కాకుండా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా రన్ చేస్తున్నారు.

#2 రామ్ చరణ్ – ఉపాసన

ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆటు అపోలో బాధ్యతలు చూసుకుంటూనే, ఇటు రామ్ చరణ్ వ్యాపార బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎన్నో విషయాలపై అవగాహన కల్పిస్తూ, అలాగే తమ వంతు సహాయం చేస్తూ సామాజిక సేవలో కూడా ముందుంటున్నారు.

#3 మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్

మహేష్ బాబు వ్యాపార వ్యవహారాలు, అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు అన్ని నమ్రత చూసుకుంటున్నారు.

#4 నాని – అంజన యలవర్తి

అంజన ఆర్కా మీడియాలో ఉద్యోగం చేస్తున్నారు. అలాగే బాహుబలి సినిమా కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేశారు.

#5 రాహుల్ రవీంద్రన్ – చిన్మయి శ్రీపాద

అటు సింగింగ్ తో పాటు, ఇటు డబ్బింగ్ కూడా మేనేజ్ చేస్తున్న చిన్మయి ఐల్ ఆఫ్ స్కిన్ (isle of skin) అనే ఒక బ్యూటీ ప్రొడక్ట్స్ కు సంబంధించిన వెబ్ సైట్ బాధ్యతలు కూడా వ్యవహరిస్తున్నారు.

#6 నందు – గీత మాధురి

గీతా మాధురి ప్లేబాక్ సింగింగ్ తో పాటు, ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా కూడా ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటారు.

#7 నితిన్ – షాలిని కందుకూరి

నితిన్ భార్య షాలిని ఎంబీఏ చదివారు. ఒక కంపెనీలో హెచ్ఆర్ గా పని చేస్తున్నారు.

heroes wives and their professions

#8 నాగ శౌర్య – అనూష శెట్టి

నాగశౌర్య భార్య అనూష శెట్టి ఒక ఆర్కిటెక్ట్. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ కి సంబంధించి వ్యాపారం కూడా చేస్తున్నారు.

heroes wives and their professions

#9 రాజీవ్ కనకాల – సుమ 

ఇటు సినిమాలు, సీరియల్స్ తో రాజీవ్ కనకాల మనల్ని అలరిస్తూ ఉంటే, అటు టీవీలో తన యాంకరింగ్ ద్వారా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు సుమ.

#10  అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి

స్నేహ సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ మ్యాగజిన్ స్పెక్ట్రమ్ కి చీఫ్ ఎడిటర్ గా చేస్తున్నారు, అంతే కాకుండా కాలేజ్ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా స్టూడియో పికాబూ పేరుతో ఒక ఫోటోగ్రఫీ స్టూడియో కూడా స్థాపించారు.