ఈ ఫోటోలో ఒక హీరోయిన్, ఒక డైరెక్టర్ ఉన్నారు..! ఎవరో కనిపెట్టగలరా..?

ఈ ఫోటోలో ఒక హీరోయిన్, ఒక డైరెక్టర్ ఉన్నారు..! ఎవరో కనిపెట్టగలరా..?

by Harika

Ads

సినిమా ఇండస్ట్రీ అన్నాక అందరూ వృత్తులు మారుతారు. డైరెక్టర్ గా ఉన్నవాళ్లు హీరోలు అవుతారు. హీరోలుగా చేసిన వాళ్ళు డైరెక్టర్లు అవుతారు. కొంత మంది ప్రొడ్యూసర్లు అవుతారు. కొంత మంది గాయకులు అవుతారు. ఇలా చాలా మంది వేరు వేరు ఇష్టాలతో ఉంటారు. ఇవే ఇష్టాలని వాళ్లు నిజం చేసుకుంటూ ఉంటారు. మల్టీ టాలెంటెడ్ అని వీళ్ళని అంటారు. ప్రతి పనిలోనూ వీళ్లు రాణిస్తారు. కొంత మంది యంగ్ దర్శకులు గతంలో హీరోలుగా నటించారు. వాళ్లు మధ్యలో బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. ఇప్పుడు తమని తాము నిరూపించుకుంటున్నారు.

Video Advertisement

heroine and director in this picture

ఈ పైన ఫోటోలో ఉన్న వ్యక్తి కూడా అలాగే హీరోలాగా అడుగు పెట్టి, ఇప్పుడు దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. బింబిసార సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు మల్లిడి వశిష్ట. ఆ సినిమా ఎంతో పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నారు. పైన ఫోటో వశిష్ట హీరోగా చేసిన సినిమాలోనిది. ఈ సినిమా పేరు ప్రేమలేఖ రాశా. ప్రముఖ రచయిత కులశేఖర్ గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ ఫోటోలో వశిష్ట పక్కన ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు చాలా పెద్ద హీరోయిన్ అయ్యారు. హీరోయిన్ అంజలి.

అంజలి ప్రేమలేఖ రాశా సినిమాలో నటించారు.  ఈ పైన ఫోటో ఆ సినిమాలోనిదే. ఇటీవల అంజలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో కూడా ప్రేక్షకులని పలకరించారు. తెలుగు అమ్మాయి అయినా కూడా, తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తమిళ్ తో పాటు మలయాళంలో కూడా అంజలి సినిమాలు చేస్తున్నారు. మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే అంజలి చేస్తున్నారు. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే అంజలి ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం అంజలి చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని చర్చల దశలో ఉంటే, కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.


End of Article

You may also like