నాగార్జున హీరోగా వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని… ఇటు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుంది అని అప్పుడే ప్రకటించారు. అప్పటినుంచి సీక్వెల్ ఎలా ఉండబోతోందా? అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది.

Video Advertisement

తాజాగా.. ఈ సినిమాకు “బంగార్రాజు” అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్నారు. నాగ చైతన్య సరసన క్రితి శెట్టి నటించనున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా బంగార్రాజు టీజర్ విడుదల చేసారు. ఈ సినిమా సంక్రాంతి కనుకగా విడుదల అవ్వబోతోంది.

heroine who acted with naga chaitanya as friend heroine and mother

టీజర్‌లో నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, క్రితి శెట్టి కనిపించారు. వీరు మాత్రమే కాకుండా సినిమాలో ఉన్న మరి కొంత మంది నటులు కూడా ఇందులో కనిపించారు. అంతే కాకుండా బంగార్రాజు సినిమా ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. పండగకి సరిపోయే సినిమా అని అనిపించేలాగా ఈ ట్రైలర్ ఉంది. ట్రైలర్ లో బంగార్రాజు అయిన నాగార్జున, రమ్య కృష్ణతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాగ చైతన్య పాత్ర వారి మనవడు అని రమ్య కృష్ణ చెప్తారు. అంటే రాము, సీత కొడుకు ఈ చిన బంగార్రాజు.

heroine who acted with naga chaitanya as friend heroine and mother

దీని ప్రకారం రెండవ నాగార్జున పాత్ర అయిన రాము పక్కన నటించిన లావణ్య త్రిపాఠి, నాగ చైతన్యకి తల్లి అవుతుంది. నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి అంతకుముందు యుద్ధం శరణం సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఆ సినిమాకంటే ముందు మనం సినిమాలో ఇద్దరు ఫ్రెండ్స్ గా కనిపిస్తారు. ఇలా లావణ్య త్రిపాఠి నాగ చైతన్యకి ఫ్రెండ్ గా, నాగ చైతన్య పక్కన హీరోయిన్ గా, అలాగే నాగ చైతన్య తల్లిగా కూడా నటించారు అన్నమాట. బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదిన విడుదల అవ్వబోతోంది.