Ads
దగ్గుబాటి హీరో వెంకటేష్ ని తెలుగు ఇండస్ట్రీ లో హేట్ చేసే వారు ఎవరు ఉండరు. అందరు ఆయన అభిమానులే. అంత గా తెలుగువారికి దగ్గరైన విక్టరీ వెంకటేష్ తాజాగా విభిన్న కథనాలతో ముందుకొస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వెంకటేష్ అన్ని రకాల కధలకు ప్రాధాన్యం ఇస్తూ.. తనదైన శైలిలో నటిస్తూ వచ్చారు. ఇక మాస్ సినిమాలను చూస్తే ఆ సెలక్షన్ స్టైల్ వేరు అన్నట్లు ఉంటుంది. ఇటీవలే “నారప్ప” తో మరో సారి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు.
Video Advertisement
తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన చిత్రాలను ఎంచుకున్న వెంకీ మామ సినీ ఇండస్ట్రీ లో ఎంతో మంది కి లైఫ్ ఇచ్చారు. తన మూవీస్ ద్వారా కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడం తో పాటు తెలుగు తెరకు కొత్త అందాలను కూడా పరిచయం చేసారు. ఎందరో కొత్త హీరోయిన్లను వెంకీ మామ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేసారు.
వారిలో బాలీవుడ్ లో టాప్ పొజిషన్ కు చేరుకున్న వారు కూడా ఉన్నారు. వీరిలో చాలామందిని వెంకీ మామే ఇండస్ట్రీ కి పరిచయం చేసారు అన్న సంగతి ఎవరికి తెలియదు. అలాగే.. ఆర్తి అగర్వాల్, వెంకటేష్ పెయిర్ ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు. ఆర్తి అగర్వాల్ ని కూడా వెంకీ మామే ఇండస్ట్రీ కి పరిచయం చేసారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగిన ఆర్తి అగర్వాల్ చిన్నవయసులోనే మరణించారు. వెంకీ మామ తన సినిమాలతో పరిచయం చేసిన కొత్త హీరోయిన్ల లిస్ట్ పై ఓ లుక్ వేయండి.
#1. ఆర్తి అగర్వాల్ – నువ్వు నాకు నచ్చావ్
#2. ఫరా – విక్రమ విజేత
#3. ఖుష్బూ – కలియుగ పాండవులు
#4. రూపిణి – ఒంటరి పోరాటం
#5. దివ్య భారతి – బొబ్బిలి రాజా
#6. టబు – కూలి నెం.1
#7. అపర్ణ – సుందరకాండ
#8.ప్రతిభ సిన్హా – పోకిరి రాజా
#9. ప్రేమ – ధర్మ చక్రం
#10. శిల్ప శెట్టి – సాహస వీరుడు సాగర కన్య
#11. వినీత – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
#12. అంజలి ఝవేరి – ప్రేమించుకుందాం రా
#13. ప్రీతీ జింటా – ప్రేమంటే ఇదేరా
#14. ట్వింకిల్ ఖన్నా – శీను #15. కత్రినా – మల్లీశ్వరి #16. నయన తార – లక్ష్మి
#17. రితికా సింగ్ – గురు
End of Article