14 ఏళ్ళకి హీరోయిన్… జాతీయ అవార్డు కూడా గెల్చుకుంది..! ఎవరో గుర్తుపట్టారా..?

14 ఏళ్ళకి హీరోయిన్… జాతీయ అవార్డు కూడా గెల్చుకుంది..! ఎవరో గుర్తుపట్టారా..?

by Mohana Priya

Ads

చాలా మంది హీరోయిన్లు చిన్న వయసులో ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి వస్తారు. టీనేజ్ లోనే హీరోయిన్లుగా నటించడం మొదలు పెడతారు. ఈ కాలంలో అది తగ్గింది కానీ, గతంలో హీరోయిన్స్ 20 ఏళ్ల లోపు వయసు ఉన్నప్పుడే సినిమాల్లోకి వచ్చేవాళ్ళు. చాలామంది హీరోయిన్స్ తాము చదువుకుంటూ సినిమాలు చేశాము అని చెప్తారు. కొంత మంది హీరోయిన్స్ అయితే కొన్ని రోజులు స్కూల్ కి వెళ్లి, కొన్ని రోజులు సినిమా షూటింగ్ చేసే వాళ్ళు అని చెప్తారు. కొంత మంది స్కూల్ అయిపోయాక కాలేజ్ చదవకుండా సినిమాల్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఇలాంటి విషయాలు తగ్గాయి. 25 దాటిన తర్వాత కూడా హీరోయిన్లుగా అడుగు పెడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.

Video Advertisement

heroine who won national award

కానీ, గతంలో హీరోయిన్స్ కి లీడ్ రోల్ చేసే సమయం తక్కువగా ఉండేది కాబట్టి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వెళ్లేవారు. కొంత మంది తెలిసిన వారి ద్వారా అవకాశం వస్తే చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టేవారు. పైన ఉన్న హీరోయిన్ కూడా 14 సంవత్సరాల వయసులో హీరోయిన్ పాత్రలో నటించారు. ఎన్నో భాషల్లో నటించి, ఒక సినిమాలో తన నటనకి నేషనల్ అవార్డు కూడా అనుకున్నారు. నటి శోభన తెలియని తెలుగు వారు ఉండరు. కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ పలికించగల హీరోయిన్ శోభన. శోభన మొదటి సినిమా మలయాళంలో వచ్చిన ఏప్రిల్ 18. ఈ సినిమా 1984 లో వచ్చింది.

ఈ సినిమాకి శోభన వయసు 14 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు శోభన. తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. కొంత కాలం శోభన తెలుగు సినిమా నుండి గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో ఒక పాత్ర పోషించారు. ఈ సినిమాలో శోభన నటిస్తున్నారు అనే విషయం అసలు తెలియదు. ట్రైలర్ విడుదల అయ్యాక శోభన అందులో కనిపించడంతో ఈ సినిమాలో శోభన ఉన్నారా అని అందరూ అనుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాలో శోభనని చూడటం చాలా మందికి ఆనందంగా అనిపిస్తోంది.


End of Article

You may also like