Ads
ఈ సంవత్సరం పండక్కి చాలా సినిమాలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సంక్రాంతి రేసులో నెగ్గాలని ప్రతి మూవీ టీం తపన పడుతుంది. అందుకే చాలా సినిమాలు పండగలో రిలీజ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటారు మేకర్స్.
Video Advertisement
అలాగే ఈ సంవత్సరం కూడా మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాగార్జున వంటి పెద్ద హీరోలు అంతా పోటీలో పాల్గొంటున్నారు. హీరోల సంగతి సినిమాల సంగతి పక్కన పెడితే హీరోయిన్లకు ఈ సీజన్ చాలా కీలకం.
సంక్రాంతి బరిలో నెగ్గితే ఆ హీరోయిన్ కి ఉండే క్రేజే వేరు. క్రిత సంవత్సరం అలాంటి క్రేజ్ ని శృతిహాసన్ దక్కించుకుంది మరి ఈ సంక్రాంతికి ఏ హీరోయిన్లు రేసులో ఉన్నారు, ఎవరు నెగ్గబోతున్నారు ఒకసారి చూద్దాం. సంక్రాంతి బరిలో రవితేజ సినిమా ఈగల్ తలపడుతుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఒకరు అనుపమ పరమేశ్వరన్ మరొకరు కావ్య థాపర్. వీళ్ళిద్దరికీ ఈ సక్సెస్ ఎంతో అవసరం.
కావ్య థాపర్ తెలుగు లో నిలదొక్కుకోవాలన్నా అనుపమ పరమేశ్వరన్ తన కెరీర్ ని తెలుగులో కొనసాగించాలన్న ఈ సినిమా హిట్ అవడం ఇద్దరికీ చాలా అవసరం. అలాగే హనుమాన్ సినిమాతో అమృత అయ్యర్ కూడా పోటీలో నిలబడుతుంది. తెలుగులో కెరియర్ కంటిన్యూ అవ్వాలంటే ఈమెకు కూడా ఒక హిట్టు పడి తీరవాల్సిందే. అలాగే నా సామి రంగా సినిమాతో ఆషిక రంగనాధ్ కూడా సంక్రాంతి బరిలో దిగుతుంది.
ఇక సైంధవ్ సినిమాలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. ఎక్కువగా శ్రద్ధ శ్రీనాథ్ మీద మీడియా ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో పాతుకు పోవాలని చూస్తుంది ఈ భామ. ఇక ద వన్ అండ్ ఓన్లీ శ్రీ లీల కూడా బరిలో నిలబడుతుంది. తెలుగులో ఇప్పటికే టాప్ హీరోయిన్ గా ఉన్న శ్రీ లీల కి ఈ మధ్య అన్ని ఫ్లాప్లే పడటం గమనార్హం. ఈమె టాప్ ప్లేస్ ని కంటిన్యూ చేయాలంటే కచ్చితంగా ఈమెకు కూడా ఒక హిట్ పడి తీరవల్సిందే.
End of Article