“దీపికా పదుకొనే” నుండి… “అలియా భట్” వరకు… కెరీర్ మధ్యలోనే తల్లులు అయిన 8 మంది హీరోయిన్స్ వీరే..!

“దీపికా పదుకొనే” నుండి… “అలియా భట్” వరకు… కెరీర్ మధ్యలోనే తల్లులు అయిన 8 మంది హీరోయిన్స్ వీరే..!

by Mounika Singaluri

Ads

చాలామంది సినిమా హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుంటారు. అందుకోసం పెళ్లి,పిల్లలని కూడా పక్కన పెడతారు. కెరియర్ ఫాల్డౌన్ అవుతుంది అనుకుంటున్న సమయంలో అప్పుడు పెళ్లి మీద పిల్లల మీద కాన్సెంట్రేట్ చేస్తారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని పిల్లలను కంటారు. అందుకోసం అవసరం అయితే కెరియర్ ని సైతం పక్కన పెడతారు.

Video Advertisement

ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటారా..బాలీవుడ్ నటి దీపిక పడుకొణే తాను ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రెజెంట్ తన కెరియర్ చాలా పీక్స్ లో ఉంది. ఆమెలాగే కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 ఐశ్వర్యారాయ్ :

ఈమె 2011లో ఒక బిడ్డకి తల్లి అయింది. అప్పుడు ఆమె సినిమాల్లో చాలా యాక్టివ్ గా ఉంది. అయినప్పటికీ బిడ్డ కోసం కొంతకాలం పాటు తన కెరీర్ ని పక్కన పెట్టింది.

know aishwarya rai properties value..!!

#2 కరీనాకపూర్ :

ఈమె 2016లో తన కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో తన తొలి ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. 8 నెలల గర్భంతో ఉన్నప్పుడు ఫోటోషూట్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది.

#3 కాజోల్ :

ఈమె 1999 ఫిబ్రవరి 24న నటుడు అజయ్ దేవగన్ ని పెళ్లి చేసుకుంది. 2003 ఏప్రిల్ లో ఒక బిడ్డకి తల్లి అయింది. నిజానికి ఆ సమయంలో ఆమె కెరియర్ మంచి పీక్స్ లో ఉంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ ఆమె కెరీర్ ని కంటిన్యూ చేసింది.

netizens comments on heroine kajol

#4 మాధురి దీక్షిత్:

ఈమె కూడా హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే డాక్టర్ శ్రీరామ్ నేనే ని పెళ్లి చేసుకొని 2003లో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.

heroines who became mothers during their working career

#5 రాణి ముఖర్జీ:

ఈమె కూడా నిర్మాత ఆదిత్య చోప్రా ని పెళ్లి చేసుకున్న తరువాత 2017 లో తొలి సంతానానికి జన్మనిచ్చింది. అప్పటికి ఆమె కెరియర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతున్న టైం.

heroines who became mothers during their working career

#6 అనుష్క శర్మ:

ఈమె కూడా కెరియర్ పరంగా బిజీగా ఉండగానే విరాట్ తో పెళ్లి తర్వాత 2021లో మొదటి సంతానం వామిక తర్వాత మొన్న ఫిబ్రవరి 15న రెండవ సంతానానికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

#7 శ్రీదేవి:

ఈమె కూడా నటనలో యాక్టివ్గా ఉన్న సమయంలోనే బోనీ కపూర్ తో పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది.

#8 అలియా భట్ :

రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్న అలియా హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉండగానే తొలి సంతానం అయినా రాహా కి 2022లో జన్మనిచ్చింది


End of Article

You may also like