Ads
ఇది వరకు సినిమాల్లో హీరోయిన్లు అంటే కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయ్యే వాళ్ళు. తర్వాత వారికీ కథలో ప్రాధాన్యతనిచ్చే పాత్రలు రావడం మొదలయ్యాయి.
Video Advertisement
వాటి తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పెరిగి.. మన హీరోయిన్లు కూడా యాక్షన్ స్తంట్స్ అదరగొట్టడం మనం చూస్తున్నాం. అలా హీరోలతో సమానంగా యాక్షన్ సీన్స్ లో అదర గొట్టిన తారలెవరో ఇప్పుడు చూద్దాం..
#1 విజయ శాంతి
లేడీ అమితాబ్ బచ్చన్, లేడీ సూపర్ స్టార్ ఈ బిరుదులన్నీ విజయ శాంతికే సొంతం. తెరపై ఆమె యాక్షన్స్ సీన్స్ చూస్తూ ప్రేక్షకులు మైమరిచిపోయేవారు. ప్రతిఘటన, ఆశయం, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ.. ఇలా చాలా సినిమాల్లో విజయ శాంతి విశ్వరూపం చూసారు ప్రేక్షకులు.
#2 అనుష్క
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ అఫ్ అనుష్క. ఈమె బాహుబలి, అరుంధతి, రుద్రమ దేవి చిత్రాల్లో యాక్షన్ సీన్స్ లో అందర్నీ మెప్పించారు.
#3 సమంత
ఇటీవల వచ్చిన యశోద చిత్రం తో పాటు, గతం లో వచ్చిన ‘ది ఫామిలీ మాన్ 2 ‘ వెబ్ సిరీస్ లో కూడా సమంత యాక్షన్ సన్నివేశాల్లో నటించింది.
#4 శ్రద్దా కపూర్
ప్రభాస్ తో కలిసి నటించిన సాహూ చిత్రం లో శ్రద్ద కపూర్ యాక్షన్స్ సీన్స్ లో నటించారు.
#5 శృతి హాసన్
క్రాక్ సినిమాలో ని ఒక సన్నివేశం లో శృతి యాక్షన్ సీన్స్ లో అదరగొట్టింది.
#6 రితిక సింగ్
వెంకటేష్ హీరోగా వచ్చిన ‘గురు’ చిత్రం లో రితిక యాక్షన్ సీన్స్ లో మెప్పించింది.
#7 దీపికా పదుకొనె
గతం లో వచ్చిన బాజీరావు మస్తానీ తో పాటు, ప్రభాస్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కె లో కూడా దీపికా యాక్షన్ సీన్స్ లో నటించింది.
#8 సాయి పల్లవి
మలయాళం లో వచ్చిన ‘అథిరన్’ చిత్రం లో సాయి పల్లవి కలరి యుద్ధ విద్యను ప్రదర్శించింది.
#9 సోనాల్ చౌహన్
ఇటీవల వచ్చిన నాగార్జున చిత్రం ‘ది ఘోస్ట్’ లో సోనాల్ నాగ్ తో కలిసి యాక్షన్ సీన్స్ లో అదరగొట్టింది.
#10 రెజినా కాసాండ్రా
ఇటీవల విడుదలైన ‘శాకినీ ఢాకిని’ చిత్రం లో యాక్షన్ సీన్స్ లో నటించింది రెజీనా.
#11 తమన్నా
బాహుబలి పార్ట్ 1 లో తమన్నా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసింది.
#12 నివేదా థామస్
ఇటీవల విడుదలైన ‘శాకినీ ఢాకిని’ చిత్రం లో యాక్షన్ సీన్స్ లో నటించింది నివేదా.
#13 ప్రియమణి
2013 లో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ మూవీ చండి లో ప్రియమణి యాక్షన్ సీన్స్ లో ఇరగదీసింది.
#14 సాక్షి చౌదరి
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం లో సాక్షి చౌదరి స్టైలిష్ ఫైట్స్ హైలైట్ అసలు.
#15 కార్తీక
అల్లరి నరేష్ నటించిన ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’ చిత్రం లో కార్తీక ఫైట్స్ తో అదరగొట్టేస్తుంది.
End of Article