“మహేష్ బాబు-త్రివిక్రమ్” కాంబినేషన్‌లో వస్తున్న సినిమాని రిజెక్ట్ చేసిన… ఆ 3 యంగ్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

“మహేష్ బాబు-త్రివిక్రమ్” కాంబినేషన్‌లో వస్తున్న సినిమాని రిజెక్ట్ చేసిన… ఆ 3 యంగ్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ అందులోనూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో అంటే ఆనందానికి హద్దులుండవు. ఎంత హీరో ప్రధానమైన సినిమా అయినా సరే హీరోయిన్ కి కొన్ని స్ట్రాంగ్ డైలాగులు ఉంటాయి గురూజీ మూవీలో.

Video Advertisement

మొన్న అరవింద సమేతలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పూజా హెగ్డే చెప్పే మాటలు అందరిని ఆలోచింప చేస్తాయి. త్రివిక్రమ్ తన తర్వాత చిత్రం కోసం హీరోయిన్స్ కోసం వేట మొదలుపెట్టాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే తో పాటు రెండవ హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందట అందుకోసం మంచి హీరోయిన్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావించారట. అందుకోసం కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ని సంప్రదిస్తే వారు నిర్మొహమాటంగా నటించమని చెప్పేసారట ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం . .

#1 శ్రీలీల:

మొదట మహేష్ బాబుకు రెండవ హీరోయిన్ గా రాఘవేంద్రరావు హీరోయిన్ (పెళ్లి సందడి) శ్రీలీలను అడగగా ఆమె ఆ పాత్ర చేయడానికి విముఖత చూపించిందట. ప్రస్తుతం వరుస సినిమాలతో శ్రీలీల బిజీగా ఉంది ఈ సమయంలో రెండవ హీరోయిన్ పాత్ర చేస్తే ఆ తర్వాత కూడా మళ్లీ రెండవ హీరోయిన్ పాత్రలే చేయాల్సి వస్తుందని ఆమె భావించినట్టు సమాచారం.

Pelli SandaD Heroine Sree Leela images

#2 నభా నటేష్:

ఇక శ్రీలీల నో చెప్పడంతో ఆ పాత్ర కోసం నభా నటేష్ ని కూడా సంప్రదించారట చిత్ర బృందం. కానీ కొన్ని కారణాలతో ఆమె కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట.

#3 నిధి అగర్వాల్:

సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించడానికి పిలిచి మరీ అవకాశం ఇచ్చినా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సైతం బిజీ షెడ్యూల్స్ కారణంగా నో చెప్పేసిందట.

ఇలా ఈ ముగ్గురు హీరోయిన్లు కూడా త్రివిక్రమ్ అవకాశమిస్తే చేయనని చెప్పడంతో టాలీవుడ్ షాక్ కి గురైంది. అయితే మరి ఆ పాత్ర కోసం మళ్ళీ వెతుకులాట ప్రారంభించిన త్రివిక్రమ్ కి ఏ హీరోయిన్ ఓకే చెప్తుందో చూడాలి.


End of Article

You may also like