ప్రేమ / పెళ్లి విఫలమయ్యాక… కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన 6 హీరోయిన్స్..!

ప్రేమ / పెళ్లి విఫలమయ్యాక… కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన 6 హీరోయిన్స్..!

by Mohana Priya

Ads

ప్రతి ఒక్కరికి వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి. కొంత మంది కుటుంబానికి ప్రాముఖ్యతనిస్తారు. కొంత మంది కెరీర్‌కి, ఇంకా కొంత మంది డబ్బుకి ఇలా ప్రతి మనిషి కొన్ని విషయాలను ఎక్కువగా పట్టించుకుంటారు కొన్ని విషయాలను వదిలేస్తారు. కానీ ఈ దృశ్యాలు ఉండటానికి ముఖ్య కారణం గతంలో వారు ఎదుర్కొన్న సంఘటనలే.

Video Advertisement

ఇండస్ట్రీ అన్న తర్వాత చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కొంత మంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని కూడా తమ కెరీర్‌ని కొనేసాగిస్తూ ఉంటే కొంత మంది తమ వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లికి దూరంగా ఉన్నారు. కొంత మంది హీరోయిన్లు పెళ్లి చేసుకున్నా, లేదా ప్రేమలో ఉన్నా సినిమాలు కొనసాగించారు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్లు రిలేషన్‌షిప్‌కి దూరం అయ్యారు. ఆ తర్వాత కూడా కొంత మంది హీరోయిన్లు ఇంకా బాగా కష్టపడి స్టార్ హోదా సంపాదించుకున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

#1 నయనతార

ప్రభుదేవాతో ప్రేమలో ఉన్న నయనతార తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత నయనతార సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఇటీవల నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ ని పెళ్లి చేసుకున్నారు.

#2 రష్మిక మందన్న

తన మొదటి కో స్టార్ అయిన రక్షిత్ శెట్టితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు రష్మిక. వారిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ తర్వాత వారిద్దరూ విడిపోయారు. రష్మిక తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ అయ్యారు.

heroines who started their second innings after breakup

#3 త్రిష

కొద్ది సంవత్సరాల క్రితం వరుణ్ మణియన్ అనే ఒక వ్యక్తితో త్రిష ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ తర్వాత వారి పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. తర్వాత త్రిష శింబుతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

#4 సమంత

ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది సంవత్సరాల తర్వాత సమంత సిద్ధార్థ్ తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సమంత, నాగ చైతన్య ప్రేమలో ఉన్నట్టు ప్రకటించారు.. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న నాలుగు సంవత్సరాలకు విడాకులు తీసుకున్నారు. తర్వాత సమంత వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. అలాగే నాగ చైతన్య కూడా వరుస సినిమాల షూటింగ్‌లతో ఉన్నారు.

pushpa oo antava song copied from copied from famous suriya song

#5 అమలా పాల్

నటి అమలా పాల్ కూడా విజయ్ అనే దర్శకుడిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం అమలా పాల్ సౌత్ ఇండియన్ భాషల్లో మాత్రమే కాకుండా హిందీలో కూడా నటిస్తున్నారు.

heroines who started their second innings after breakup

#6 మంజు వారియర్

మలయాళం స్టార్ హీరోయిన్ మంజు వారియర్ కూడా పెళ్లయిన కొద్ది సంవత్సరాల తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. కానీ తర్వాత కొంత విరామం తర్వాత మళ్లీ సినిమాలు చేయడం మొదలు పెట్టారు.

malayalam actress manju warrier latest pictures going viral

అలా ఈ హీరోయిన్లు ప్రేమలో విఫలం అయిన తర్వాత తమ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నారు.


End of Article

You may also like