వరుస ఫ్లాప్స్ తరువాత శృతిహాసన్ తో జత కట్టి హిట్ కొట్టిన 5 టాలీవుడ్ హీరోస్ ఎవరో తెలుసా.?

వరుస ఫ్లాప్స్ తరువాత శృతిహాసన్ తో జత కట్టి హిట్ కొట్టిన 5 టాలీవుడ్ హీరోస్ ఎవరో తెలుసా.?

by Anudeep

Ads

కొన్ని కొన్ని సార్లు ఏదైనా మనకి కలిసిరావడం అనేది యాదృచ్చికంగా జరిగినప్పటికీ అది మనం సెంటిమెంట్ లా ఫీల్ అవుతుంటాం. ఎవరైనా మనకు ఎదురొస్తేనే, మన పక్కనుంటేనో మనకి మంచి జరిగితే వాళ్ళ వల్లే అయింది అని సెంటిమెంట్ ఫీల్ అవుతుంటాం. ఇలాంటివి మూవీస్ లో చూస్తూ ఉంటాం. ఫలానా డైరెక్టర్ అయితే పక్క హిట్ అవుతుంది.. ఆ హీరోయిన్ ఆక్ట్ చేసిందంటే సినిమా హిట్ అయిపోతుంది ఇలా కొన్ని సార్లు మనం పక్కా సెంటిమెంట్ నే నమ్ముకుంటాం. అలా.. టాలీవుడ్ హీరోస్ కు శృతి హాసన్ ఎలా లక్ తీసుకొచ్చిందో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

Video Advertisement

టాలీవుడ్ లో పాపులర్ హీరోస్ కి మాస్ కమ్ బ్యాక్ నే ఇచ్చింది శృతి పాప. ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మొదలు పెట్టేద్దాం. పవర్ స్టార్ రేంజ్ గురించి మనం కొత్తగా చెప్పుకోక్కర్లేదు. హిట్ లకు, ఫ్లాపులకు ఆయనకు ఎలాంటి సంబంధం ఉండదు. పవర్ స్టార్ సినిమా అంటేనే గుడి కి క్యూ కట్టినట్లు ఫాన్స్ క్యూ కడతారు. వరుస గా మూడు ఫ్లాపుల తరువాత పవర్ స్టార్ కి గబ్బర్ సింగ్ రూపం లో సూపర్ హిట్ తగిలింది.

sruthi hasan gabbar singh

జల్సా సినిమా హిట్ అయ్యాక పవన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ తరువాత వచ్చిన కొమరం పులి అంత గా ఆకట్టుకోలేదు. తీన్ మార్ కూడా ప్లాప్ అయ్యింది. పంజా సినిమా వచ్చేసరికి మొదట్లో ఆడ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సినిమా బాగుంది అని అందరు అనుకుంటుంటారు కానీ, సినిమా రిలీజ్ అయినపుడు వచ్చిన టాక్ డిఫరెంట్ ఉంది. వీటి తరువాత, శృతి హాసన్ పవన్ కళ్యాణ్ జంట గా నటించిన “గబ్బర్ సింగ్” ఓ రేంజ్ లో హిట్ అయింది. గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ గట్టి కమ్ బ్యాక్ నే ఇచ్చారు.

sruthi hasan srimanthudu

సూపర్ స్టార్ మహేష్ బాబు కి కూడా ఇలానే జరిగింది. నేనొక్కడినే (1) , ఆగడు సినిమాలు థియేటర్ లో అంతగా నిలదొక్కుకోలేదు. నేనొక్కడినే సినిమా అండర్ రేటెడ్ మూవీ గా చెప్పుకున్నా, సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం బోల్తా కొట్టింది. ఈ రెండు ఫ్లాప్స్ తరువాత వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా లో మహేష్ బాబు సరసన శృతి హాసన్ నటించారు. అలా శృతి హాసన్ మహేష్ బాబు కి కూడా లక్ అయ్యారు.

sruthi hasan crack

రవితేజ “క్రాక్” సినిమా తో మాస్ కామ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్. రవితేజ ను ఇటీవల వరుస ఫ్లాపులు నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు ఫ్లాపుల తరువాత రవితేజ సూపర్ హిట్ కొడుతున్నారు. టచ్ చేసి చూడు,నేల  టికెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా సినిమాలు మాస్ అభిమానులను నిరాశపరిచాయి. రవితేజ శృతి హాసన్ జంటగా నటించిన “క్రాక్” సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.

అల్లు అర్జున్ కి కూడా శృతి హాసన్ లక్కీ చార్మ్ నే. ఇద్దరమ్మాయిలతో సినిమాల ఫ్లాప్ అయ్యాక, శ్రుతీ హాసన్ తో జంటగా చేసిన సినిమా “రేసు గుర్రం” బాక్స్ ఆఫీస్ రికార్డు లు బద్దలు కొట్టేసింది.

ఇంకా, నాగ చైతన్య కి కూడా శ్రుతీ హాసన్ కలిసొచ్చింది. ఆటోనగర్ సూర్య, దోచేయ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాక, శృతి హాసన్ తో కలిసి చేసిన “ప్రేమమ్” సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇక నెక్స్ట్ ప్రభాస్ కూడా సలార్ లో శృతి హస్సన్ తో జతకట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ప్రభాస్ కి బాహుబలి తర్వాత…సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో వరస ఫ్లాపులు వచ్చాయి. ఇప్పుడు సలార్ తో ప్రభాస్ కం బ్యాక్ ఇస్తారని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే ప్రభాస్ కి కూడా శృతి హస్సన్ లక్కీ హీరోయిన్ అయినట్టే.

 


End of Article

You may also like