బాలీవుడ్ వాళ్ళు ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు కూడా తీస్తారా..? ఈ సినిమా చూశారా..?

బాలీవుడ్ వాళ్ళు ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు కూడా తీస్తారా..? ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

బాలీవుడ్ ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ మూవీ తాజాగా విడుదల అయ్యింది. మొదటి రోజు మొదటి షో నుండే మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

  • నటీనటులు: రణ్‌వీర్ సింగ్, ఆలియాభట్, జయబచ్చన్, ధర్మేంద్ర, షబానా ఆజ్మీ, టాటా రాయ్ చౌదరీ, భారతీ సింగ్, వరుణ్ ధావన్, అనన్య పాండే, సారా ఆలీ ఖాన్, జాన్వీ కపూర్ తదితరులు
  • దర్శకత్వం: కరణ్ జోహర్
  • నిర్మాతలు: హిరూ యష్ జోహర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
  • సినిమాటోగ్రఫి: మనుష్ నందన్
  • మ్యూజిక్: ప్రీతమ్
  • రిలీజ్ డేట్: 28 జులై 2023
    Rocky-Aur-Rani-Kii-Prem-Kahaani-Review

స్టోరీ:

ఢిల్లీలో టాప్ మిఠాయి బిజినెస్ కంపెనీకి వారసుడు రాకీ రాంధ్వా (రణ్‌వీర్ సింగ్). వీరిది పంజాబీ కుటుంబం.  లగ్జరీ లైఫ్ గడిపే రాకీకి తాత కన్వల్ (ధర్మేంద్ర), అమ్మమ్మ ధనలక్ష్మీ ( జయ బచ్చన్) ఉంటారు. రాకీ తాత ప్రేమించిన జమిని ఛటర్జీ (షబానా ఆజ్మీ)ని కలపడం కోసం ప్రయత్నిస్తుంటాడు.ఆ క్రమంలోనే జమిని ఛటర్జీ మనవరాలు జర్నలిస్టు అయిన రాణి ఛటర్జీ (ఆలియాభట్)ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ రాణి, రాకీ ప్రేమకు ఇద్దరి ఫ్యామిలీలు అభ్యంతరం చెబుతాయి. అయితే రాణి, రాకీ ప్రేమకు వారి కుటుంబాల నుండి ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి? తమ ప్రేమ గెలిపించుకోవడానికి రాకీ, రాణి ఏం చేశారు? అనేది మిగిలిన కథ.  రివ్యూ: 

డైరెక్టర్ కరణ్ జోహర్ శైలిలో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఈ మూవీ. డ్యాన్సులు, పాటలు, ఊహకు అందని ఎమోషన్స్ తో సరదాగా సాగే కథ. రెండు ఫ్యామిలీలు, రాణి, రాకీ లవ్ స్టోరీ రొటీన్‌గా ఉంటుంది. క్లైమాక్స్ లో ఏం జరుగుతందనేది ఊహించే విధంగా ఉంటుంది.మిఠాయి బిజినెస్ నిర్వహించే ఫ్యామిలీకి చెందిన యువకుడిగా రణ్‌వీర్ సింగ్ ఒదిగిపోయాడు. స్టైల్,బాడీ లాంగ్వేజ్, లుక్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకుంటాడు. జర్నలిస్టు పాత్రలో రాణి గా,ఎమోషనల్ సన్నివేశాలలో ఆలియా భట్ నటన బాగుంది.ధర్మేంద్ర, షాబానా ఆజ్మీ, జయబచ్చన్ వారి క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. వరుణ్ ధావన్, సారా ఆలీ ఖాన్, అనన్య పాండే, జాన్వీ కపూర్ గెస్ట్ రోల్స్ లో మెరిశారు. మిగతా వారు తమ పాత్రల మేరకు నటించారు.రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీకి ప్రీతమ్ అందించిన సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ష్, సినిమాటోగ్రఫి బాగుంది. ధనవంతుల కుటుంబాల ఇంటి సెటప్‌తో సహా ప్రతీ సీన్ రిచ్‌గా తీశారు. డైలాగ్స్ ఫన్, కామెడీ, ఎమోషనల్‌ ఆకట్టుకున్నాయి. మూవీలో ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.ప్లస్ పాయింట్స్ :

  • రణ్‌వీర్ సింగ్
  • ఆలియాభట్, రణ్‌వీర్ సింగ్ లవ్ ట్రాక్,
  • సినిమాటోగ్రఫీ
  • సంగీతం

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ స్టోరీ

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్:

కరణ్ జోహర్ తెరకెక్కించిన ‘కభీ కుషీ కభీ ఘమ్’ మూవీ తరహాలో ఉండే స్టోరీ. రొటీన్ ఫ్మామిలీ డ్రామా, కరణ్ జోహర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ మూవీ నచ్చుతుంది.

watch trailer : 

Also Read: “జైలర్” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

 


End of Article

You may also like