దేవుడా…ఈ క్రియేటివిటీని చూస్తే మైండ్ బ్లాక్ అయ్యిపోతుంది..!

దేవుడా…ఈ క్రియేటివిటీని చూస్తే మైండ్ బ్లాక్ అయ్యిపోతుంది..!

by Megha Varna

Ads

క్రియేటివిటీని బట్టి కొత్త కొత్త వస్తువులు తయారు చేయడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పనికిరాని సామాన్లతో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ని చేయడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.

Video Advertisement

అయితే తాజాగా ఒక వ్యక్తి అలాంటి ఇన్వెన్షన్ ని చేశాడు. తన పనిని ఈజీగా మార్చుకోవడానికి అతడు బైక్ ని ఉపయోగించి ఒక ఇన్వెన్షన్ చేసాడు. అది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యిపోతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే..

హైవే రోడ్డు మీద ఒక వ్యక్తి తన బైక్ కి రంగులరాట్నం బిగించి బైక్ ని నడపడం మనం ఆ వీడియోలో చూడొచ్చు. అయితే ఆ ఉయ్యాలకి ఒక కార్ స్టీరింగ్ ని రంగులరాట్నంకి ఫిక్స్ చేశాడు. ఒక చేతితో తాను బైక్ ని.. మరొక చేతితో జెయింట్ వీల్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాడు.

పైగా ఎంతో వేగంగా వెళ్తున్నాడు. అలానే ఆ జెయింట్ వీల్ లో అతని కుటుంబం కూడా ఉంది. ఈ వీడియోని పక్క నుండి వెళ్తున్న ఒక కార్ లో వ్యక్తి తీశాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేసి మా సొంత వలస ఇంజనీర్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈ వీడియోని చూసి చాలా మంది చూసారు మరియు కామెంట్లు చేస్తున్నారు. అమేజింగ్ టాలెంట్ అంటూ పొగుడుతున్నారు.

 


End of Article

You may also like