21 ఏళ్ల కుర్రాడు.. ఈ చిన్న ఐడియాతో లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇతని స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

21 ఏళ్ల కుర్రాడు.. ఈ చిన్న ఐడియాతో లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇతని స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

by Megha Varna

Ads

ఈ కామర్స్ కి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతమైన ఆదరణ ఉంది. అయితే కొన్ని వ్యాపారాల్లో మనం చూసుకున్నట్లయితే అందరూ రాణించలేకపోతారు. కొంత కాలం వ్యాపారం చేసాక నష్టాలు కలగడం లేదా సమస్యలు రావడం వల్ల మధ్యలోనే చేతులెత్తేస్తారు. అలానే గ్రోసరీ డెలివరీ వ్యాపారంను అంతర్జాతీయంగా పేరు ఉన్న బడా సంస్థలు దిగ్గజ వ్యాపారులు చేతులెత్తేశారు.

Video Advertisement

 

కానీ 21 ఏళ్ళ కుర్రాడు మాత్రం ఈ వ్యాపారంలో దూసుకుపోతున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. 21 ఏళ్ల షెరుంగ్‌ జలాన్ వ్యాపారంతో దూసుకెళ్లి పోతున్నాడు. తనకి 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఈ ఆలోచన రావడం జరిగింది. ఈ కుర్రవాడు తన దగ్గరున్న ముప్పై వేల రూపాయితో పాటు తల్లిదండ్రుల దగ్గర కొంత డబ్బుని తీసుకుని వాటితో ఈ వ్యాపారం మొదలు పెట్టాడు. అయితే వ్యాపారం చేయడం అనుకున్నంత సులభం కాదు.

Effect of the Pandemic on the Indian E-Commerce Industry

 

కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటాయి. బజార్ క్రాఫ్ట్ అనే ఈ కామర్స్ సంస్థను ఇప్పుడు జలాన్ నడిపిస్తున్నాడు. మొత్తం 43 మంది ఇందులో ఉన్నారు. సుమారు రోజుకు 200 కి పైగా ఆర్డర్లు వస్తాయి. మొదట్లో స్టోర్ నుండి సరుకులు తీసుకు వెళ్లి డెలివరీ చేసే వారు. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా తయారీ సంస్థల నుండి సరుకులు డెలివరీ చేస్తున్నారు.

 

The Role of E-commerce in your Life | Dash Technologies

 

ఇలా చేస్తే ఆఫర్లు పెట్టడానికి బాగుంటుంది అని ఆలోచించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, ఇతర ఖర్చులు ఇలా అన్నింటికీ ఎక్కువే ఖర్చవుతుంది. అయితే ఉద్యోగుల విషయంలో చాలా తెలివిగా ఆలోచించాడు. చదువు అయిపోయిన వాళ్ళని, చదువు మధ్యలో వదిలేసిన వాళ్ళని, ఫ్రెషర్స్ ని ఇందులో తీసుకున్నాడు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి తక్కువ జీతం ఇస్తే సరిపోతుంది ఏది ఏమైనా ఇంత చిన్న వయసులో అంత తెలివిగా రాణించడం నిజంగా గొప్ప విషయం. ఇలాంటి వాళ్ళు ఎందరికో ఆదర్శం.


End of Article

You may also like