‘హిట్ 2’ సినిమా కి చక్కటి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో అడివి శేష్ హీరోగా నటించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. హీరో నాని సమర్పణ లో ప్రశాంతి త్రిపిర్నేని ది వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ పై ఈ చిత్రం నిర్మించారు. అయితే హిట్ యూనివ‌ర్స్‌లో ఇప్పటి దాకా రెండు పార్ట్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Video Advertisement

అయితే ఫస్ట్ పార్ట్ ని చూస్తే.. హిట్ ఫస్ట్ పార్ట్ లో విశ్వ‌క్ సేన్‌ హీరోగా నటించారు. రెండవ పార్ట్ లో అయితే అడివి శేష్ నటించారు. అలానే హిట్ 3, హిట్ 4 కూడా వున్నాయట.

hit-3-telugu-adda

మొదటి రెండు పార్ట్స్ ఎలా అయితే ఆకట్టుకున్నాయో.. హిట్ 3, హిట్ 4 మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. అయితే ఈ చిత్రాల్లో ఎవరు హీరోలు అనేది చూస్తే.. హిట్ 3 సినిమాలో నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నారట. అలానే హిట్ 4 సినిమాకి అయితే విక్ట‌రీ వెంక‌టేష్ ని హీరోగా అనుకుంటున్నారు. ఇంకా పూర్తిగా అయితే మనకి తెలీదు. హిట్ 3 క్లైమాక్స్‌ చూస్తే తెలుస్తుంది. హిట్ 3 క్లైమాక్స్‌ లో హిట్ 4 హీరో ఎవరనేది స్పష్టం అవుతుంది. హిట్ 3 క్లైమాక్స్‌ లో హీరో వెంక‌టేష్ పాత్ర‌ ని ప‌రిచ‌యం చేస్తారని టాక్. మరి ఏం అవుతుంది అనేది చూడాల్సి వుంది.

హిట్ 3 లో అర్జున్ స‌ర్కార్ అని ఓ బ్రూట‌ల్ పోలీస్ ఆఫీస‌ర్‌ పాత్ర లో నాని కనపడనున్న. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల అవుతుంది. శైలేష్ కొల‌ను పేరు మోతమోగిపోతోంది. టాలీవుడ్ ద‌ర్శ‌కుల పేర్ల‌లో ఈ మధ్యన ఈయన పేరు ఎక్కువ వినపడుతోంది. హిట్ వ‌ర్స్ యూనివ‌ర్స్ ఫ్రాంచైజీ. మొత్తం ఏడు సినిమాల‌ను దీనిలో భాగంగా తీసుకు రానున్నారు. అయితే ఆరు సినిమాలలో ఆరుగురు హీరోలు కనపడనున్న. ఆఖరి పార్ట్ లో అయితే మొత్తం ఆరు మంది హీరోలు కనపడతారట. ఆరుగురు ఒకే స్క్రీన్ మీద కనపడుతున్నారంటే ఆడియన్స్ కి పండుగే.