టాలీవుడ్ లో సీక్వెల్ సందడి తగ్గినట్లనిపించినా మళ్ళీ పుంజుకుంది. ఇటీవల కాలంలో సీక్వెల్ హడావుడి హుషారెత్తిస్తోంది. ఇటీవల కాలంలో సూపర్ హిట్టయిన కొన్ని చిత్రాలకు సీక్వెల్స్ తెరకెక్కించే ఉత్సాహంలో ఉన్నారు పలువురు దర్శకులు.

Video Advertisement

మొదటి భాగాన్ని ఆదరించిన ప్రేక్షకులు ‘తరువాయి భాగం’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలో టాలీవుడ్ లోనే కాక ఇతర భాషల్లో కూడా రాబోతున్న సీక్వెల్‌ సినిమాలు ఏమున్నాయో తెలుసుకుందాం.

#1 పుష్ప 2

upcoming telugu sequel movies
అల్లు అర్జున్, మందన్న హీరో, హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప’. ఈ సినిమాకు రెండో భాగంగా పుష్ప 2 (పుష్ప ది రూల్) రాబోతుంది.

#2 డీజే టిల్లు 2

upcoming telugu sequel movies
సిద్ధూ జొన్నలగడ్డ , నేహా శెట్టి జంటగా నటించిన కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డీజే టిల్లు’కు కూడా సీక్వల్ రెడీ చేస్తున్నారు.

#3 పొన్నియిన్ సెల్వన్ 2

upcoming telugu sequel movies
దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ మూవీ రెండో భాగం రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి కావొచ్చింది తెలుస్తోంది.

#4 రాక్షసుడు 2

upcoming telugu sequel movies
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన సినిమా రాక్షసుడు.ఈ సినిమా వచ్చిన మూడేళ్ల తర్వాత ఇప్పుడు రాక్షసుడి చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది.

#5 కెజియఫ్ 3

upcoming telugu sequel movies
కెజియఫ్ సిరీస్‌లో ఇప్పటికే రెండు సినిమాలు రాగా.. మరో సినిమా కూడా రాబోతుందని టాక్. కెజియఫ్-2 క్లెమాక్స్‌లో పార్ట్‌-3 ఉండబోతుందని హింట్‌ ఇచ్చారు దర్శక నిర్మాతలు.

#6 రంగస్థలం 2

upcoming telugu sequel movies
రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం రంగస్థలం. దీనికి కూడా సీక్వెల్ రాబోతుందని సమాచారం. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

#7 బాహుబలి 3

upcoming telugu sequel movies
బాహుబలి..తెలుగు సినిమా స్థాయినే కాకుండా, యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిందీ సినిమా. రెండు పార్టులుగా విడుదలైన ఈ సినిమా అత్యంత భారీ కలెక్షన్లను రాబట్టి ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఆయితే ఒక ఇంటర్వ్యూ లో భాగంగా బాహుబలి 3 తీసే అవకాశం ఉందంటూ రాజమౌళి వ్యాఖ్యలు చేసారు.

#8 అఖండ 2

upcoming telugu sequel movies
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్ గ్యారంటీ అని ప్రేక్షకులు నమ్ముతున్నారు. అందుకే ఖండకు సీక్వెల్ కథను ముందే సిద్ధం చేశారట దర్శకుడు బోయపాటి. అఖండ సినిమా ముగిసిన తీరు చూస్తుంటే చాలామంది ప్రేక్షకులు సీక్వెల్ ఉంటుందనే నమ్మకంతోనే ఉన్నారు. అయితే త్వరలోనే ఈ సీక్వెల్ కూడా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. 2023లో అఖండ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

#9 కిక్ 3

upcoming telugu sequel movies
రవి తేజ, సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన కిక్ సూపర్ హిట్ అయినా విషయం తెల్సిందే. అందుకే కిక్ 2 , కిక్ 3 కథలు కూడా సిద్ధం చేసుకున్నారట. కానీ కిక్ 2 ప్లాప్ అవ్వడం తో ఈ ప్రాజెక్ట్ మూలన పడిందని సమాచారం.

#10 అవతార్ 2

upcoming telugu sequel movies
2009లో విడుదలైన ‘అవతార్’ మొదటి పార్ట్ ప్రేక్షకులకు సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అవతార్ 2 డిసెంబర్ 2022న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కేవలం రెండు పార్టులు మాత్రమే కాదు దాదాపు 5 పార్టులు రానున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు దర్శకుడు జేమ్స్ .

#11 హిట్ 2

upcoming telugu sequel movies
వైవిధ్యమైన చిత్రాలతో హిట్స్‌ అందుకుంటున్న హీరో నాని నిర్మించిన చిత్రం ‘హిట్‌’. విశ్వక్‌ సేన్, రుహానీ శర్మ జంటగా నటించారు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. ఇప్పుడు హిట్ 2 లో అడవి శేష్ నటించారు. ఈ యేడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

#12 గూఢచారి 2

upcoming telugu sequel movies
గూఢాచారి 2 అడవి శేష్ హీరోగా వచ్చిన గూఢాచారి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు శేష్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు అడివి శేష్ వెల్లడించారు.

#13 డీ అండ్ డీ డబల్ డోస్

upcoming telugu sequel movies
14 ఏళ్ల కింద వచ్చిన ఢీ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్రకటించాడు శ్రీను వైట్ల. విష్ణు హీరోగా ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

ఇవే కాకుండా రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’కి , రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్‌’కి , గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వం వహించిన ‘లక్ష్యం’కి , తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ మూవీకి సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’, తేజా సజ్జ ‘జాంబి రెడ్డి’, నవీన్‌ పోలిశెట్టి ‘జాతిరత్నాలు, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, విశ్వక్‌ సేన్‌ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రాలకు కూడా సీక్వెల్స్ రాబోతున్నట్లు సమాచారం.