హిట్ సినిమా చాలా మంది. ఈ హిట్ ఫస్ట్ కేస్ 2020 లో విడుదల అయింది. ఈ థ్రిల్లర్ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రశాంతి త్రిపురనేని నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో విశ్వక్సేన్, రుహాని శర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ మేరకు ఈ సినిమా కథ సాగుతుంది.

Video Advertisement

ఇక ఇది ఇలా ఉంటే హిట్ రెండో పార్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిజంగా హిట్ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు రెండో పార్ట్ కూడా చూసేందుకు ఇష్టపడతారు. అయితే ఈ సినిమాలో ఒక ట్విస్ట్ ఉంది.

అదేంటంటే ఈ సినిమాకి హీరోగా నాని నటించచ్చు అని తెలుస్తోంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చూస్తే నాని ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. శైలేష్ మరియు నాని హిట్ 2 సినిమా కి సంబంధించి విషయాలు మాట్లాడుకున్నారని రెండవ భాగం లో నాని నిర్ణయం కి వచ్చారట. అలానె హిట్ 2 క్లైమాక్స్ లో హిట్ 3 గురించి పరిచయం చేస్తారట. ఈ విషయాలని అడవి శేష్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

ఇది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. మరి మనం ఈ సినిమాని చూడడానికి ఇంకొన్ని రోజులు ఆగాల్సి ఉంది. ఇంకా షూటింగ్ కూడా మొదలు కాలేదు. హిట్ 1 లానే హిట్ టు ఉండనుందా ఎలాంటి కథ తో ఈ స్టోరీ ఉండనుంది..? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.