Ads
మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా రామ్ చరణ్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. రెండో సినిమా ‘మగధీర’తోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాదు… తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ‘రంగస్థలం’ సినిమాతో నటుడిగా మరింత ఎత్తుకు ఎదిగారు. ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ పేరు అంతర్జాతీయ స్థాయిలో వినబడుతోంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికా లో హాలీవుడ్ ని చుట్టేస్తున్నాడు.
Video Advertisement
ఆర్ఆర్ఆర్ మూవీకి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ వరుస ఇంటర్వ్యూలు, టీవీ షోలు, సెలబ్రిటీలతో చిట్‌చాటింగ్ లతో బిజీ గా ఉన్నాడు. అక్కడ రామ్ చరణ్‌ని హాలీవుడ్ సెలబ్రిటీలు రిసీవ్ చేసుకుంటున్న తీరు.. మెగా పవర్ స్టార్‌ని వాళ్లు పొగడ్తల్లో ముంచెత్తుతున్న తీరు చూస్తోంటే.. రామ్ చరణ్ అమెరికాలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే రిప్రజెంట్ చేస్తోన్న ఫీల్ కలుగుతోంది. అయితే తాజాగా లాస్ ఏంజెల్స్‌లో కేటీఎల్ఏ ఎంటర్‌టైన్మెంట్ వాళ్లు నిర్వహించిన టీవీ షోలో అతిథిగా పాల్గొన్న చరణ్‌ని అక్కడున్న హోస్టులు ఇంటర్వ్యూ చేస్తూ.. రామ్ చరణ్‌ని ‘ బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా ‘ అంటూ కాంప్లిమెంట్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ అంటే ప్రపంచం మొత్తం మెచ్చిన హీరో. అలాంటి హీరోతో చరణ్‌ను పోలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో తొలుత పాల్గొన్న రామ్ చరణ్… ఆ తర్వాత ఏబీసీ న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పుడు కేటీఎల్ఏ న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అక్కడే ‘బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా’ చరణ్ అనే పిలుపు వినిపించింది. ఇక హోస్ట్ ఇచ్చిన ఈ కాంప్లిమెంట్స్‌కి చిరునవ్వుతోనే స్పందించిన రామ్ చరణ్.. ఐ లైక్ బ్రాడ్ పిట్ అంటూ రిప్లై ఇచ్చాడు.
రామ్ చరణ్‌కి వచ్చిన ఈ కాంప్లిమెంట్స్‌ని చరణ్ కన్నా ఎక్కువ అతడి అభిమానులే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్‌కి వచ్చిన ఈ కాంప్లిమెంట్స్ అతడి హార్ట్‌వర్క్‌కి, యాక్షన్‌కి, లుక్స్ అండ్ అప్పీయరెన్స్‌కి దక్కిన గౌరవంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక మరోవైపు ఇప్పుడు ఆస్కార్ అవార్డుల మీద అందరి చూపు, ముఖ్యంగా భారతీయ ప్రేక్షకుల చూపు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ‘నాటు నాటు…’ పాటకు ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఆ అవార్డు వేడుకకు రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి తదితరులు వెళ్ళనున్నారు.
ఇక ఆస్కార్స్ వేదికపై ‘నాటు నాటు..’ పాట లైవ్ పెర్ఫార్మన్స్ గురించి అడగగా.. ఆ పాటను ఆదరించి ఫ్యాన్స్, ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు. ఇప్పుడు ఆ పాటకు లైవ్ పెర్ఫార్మన్స్ చేయడం ద్వారా ప్రేక్షకులకు మా ప్రేమను చూపించాలని అనుకుంటున్నాం. ప్రేక్షకులకు ఇది ట్రిబ్యూట్ అని పేర్కొన్నాడు. ఆస్కార్స్ జరిగేలోపు రామ్‌చరణ్ మరికొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. అలాగే తారక్ వచ్చాక అతనితో కలసి కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు.
End of Article