అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ టీజర్ లోని ఇంట్రెస్టింగ్ విషయాలు..

అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ టీజర్ లోని ఇంట్రెస్టింగ్ విషయాలు..

by kavitha

Ads

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్‌ ఈ మూవీతో పాన్‌ ఇండియా స్టార్ గా మారారు. దాంతో సీక్వెల్‌గా రాబోతున్న’పుష్ప 2’మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ‘హంట్‌ ఫర్‌ పుష్ప’ అనే కాన్సెప్ట్‌ వీడియోను రిలీజ్ చేశారు.

Video Advertisement

పుష్ప2 మూవీకి సంబంధించి  చిన్న అప్ డేట్ వచ్చినా కూడా  మూవీపై అంచనాలను మరింతగా పెంచుతూ పుష్ప2 ఇండస్ట్రీ హిట్ అనే విశ్వాసాన్ని కలిగిస్తోంది. ఈ క్రమంలో పుష్ప2  మూవీ నుంచి టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ కు వ్యూస్ రికార్డ్ రేంజ్ లో వస్తున్నాయి. తెలుగు టీజర్ కు 18 మిలియన్ల వ్యూస్ నమోదు అయ్యాయి. ఇక ఈ టీజర్ తో ఈ మూవీ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ సినిమా మైత్రీ మేకర్స్‌ పతాకం పై రవిశంకర్‌, నవీన్‌ ఎర్నేని, ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.pushpa-2-update1ఈ టీజర్ లో అల్లు అర్జున్‌ తగ్గేదేలే మ్యానరిజంలో చేతికున్న చిటికిన వేలు గోరు పెద్దగా ఉన్నట్టుగా చూపించారు. ఆ వీడియోలో విజువల్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ రంగులో ఉండడం, ఆ గోరు మాత్రమే రంగులో హైలైట్ గా చూపించారు. దీనితో దర్శకుడు సుకుమార్ బ్రిలియెన్స్ కనిపించింది. దాంతో ఆసక్తికర ప్రశ్న కూడా తలెత్తింది. అది దేనికి సూచన అంటూ చర్చిస్తున్నారు. pushpa-2-update3అయితే ఆ తరువాత విడుదల చేసిన పుష్ప ఫస్ట్ లుక్ తో ఆ గోరు విషయంలో క్లారిటీ వస్తుంది. ఫస్ట్ లుక్ లో బన్నీ అమ్మవారి వేషధారణలో కనిపించారు. ఆ వేషధారణ కోసమే గోరు పెంచారని తెలుస్తోంది. చిత్తూరు ప్రాంతంలో ఉన్న అమ్మవారి ఆచారం ప్రకారంగా మొక్కు తీర్చడం కోసం పురుషులు అమ్మవారిలా వేషం ధరిస్తారని, ఇప్పటికీ కూడా ఆ ఆచారం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. దీనితో ఈ విషయం వైరల్ గా మారింది.  Also Read: “హౌజ్‌ కీపింగ్‌” నుండి నటిగా మారిన ”త్రినయని” సీరియల్ తిలోత్తమ స్టోరీ..! ఈమె కథ వింటే హాట్సాఫ్ అనాల్సిందే..!


End of Article

You may also like