“చనిపోయిన క్యారెక్టర్ ఎలా బతికి వచ్చింది..?” అన్న నెటిజెన్ ప్రశ్నకి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన “విక్రమ్” డైరెక్టర్..!

“చనిపోయిన క్యారెక్టర్ ఎలా బతికి వచ్చింది..?” అన్న నెటిజెన్ ప్రశ్నకి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన “విక్రమ్” డైరెక్టర్..!

by Anudeep

Ads

మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి. అందుకే తమిళ హీరోలు కూడా మనకి పరిచయం అయ్యే ఉంటారు.

Video Advertisement

ఈ జూన్ 3వ తేదీన కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం ఊర మాస్ అంటూ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వినిపిస్తుంది. మంచి కలెక్షన్లు రాబడుతు బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.

lokesh 1

మన కథానాయకుడు కమల్ హాసన్ నటన గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన సహజమైన నటనతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తారు. అయితే.. ఈ సినిమాలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ మల్టివర్స్ కాన్సెప్ట్ ను చూపించారు. ఖైదీ సినిమాలో ఓ పాత్రని విక్రమ్ సినిమాలోకి తీసుకొచ్చారు. అయితే.. ఈ అర్జున్ దాస్ పాత్ర ఖైదీ సినిమాలో చనిపోయినట్లు చూపించారు. తిరిగి ఈ పాత్ర “విక్రమ్” సినిమాలో కనిపించడంతో ప్రేక్షకుల్లో కొత్త డౌట్ లు వచ్చాయి.

lokesh

అయితే.. ఇటీవల ‘ఆస్క్ డైరెక్టర్ లోకేష్’ పేరిట దర్శకుడు లోకేష్ అభిమానులతో చిట్ చాట్ పెట్టుకున్నారు. ఈ చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానం ఇచ్చారు. చనిపోయిన అర్జున్ దాస్ పాత్ర తిరిగి ఎలా బతికి వచ్చింది అని ఓ నెటిజెన్ ప్రశ్నించగా.. దానికి లోకేష్ “అర్జున్ దాస్” పాత్ర చనిపోలేదని, నెపోలియన్ వలన గడ్డం మాత్రమే గాయపడిందని.. అందుకే విక్రమ్ సినిమాలో అర్జున్ దాస్ పాత్రకి స్టిచ్ మార్క్ కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే.. అర్జున్ దాస్ పాత్ర బతికే ఉందన్న విషయం ఖైదీ పార్ట్ 2 లో తెలుస్తుంది అని దర్శకుడు లోకేష్ చెప్పుకొచ్చారు.


End of Article

You may also like