Ads
తెలుగు స్టార్ హీరోయిన్ తమన్నా ఇప్పటికే తెలుగులో ఒక వెబ్ సిరీస్, తమిళంలో ఒక వెబ్ సిరీస్ చేసింది. తాజాగా తమన్నా హిందీ వెబ్ సిరీస్ లో నటించింది.ఆమె నటించిన ‘జీ కర్దా’ నేడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.
Video Advertisement
- వెబ్ సిరీస్ : జీ కర్దా
- నటీనటులు : తమన్నా, సుహైల్ నయ్యర్, ఆషిమ్ గులాటి, అన్యా సింగ్, సయాన్ బెనర్జీ, సంవేదన, మల్హర్ టక్కర్, హుస్సేన్ దలాల్, అక్షయ్ బింద్రా, కిరా నారాయణన్, సిమోన్ సింగ్ తదితరులు
- నిర్మాత : దినేష్ విజన్
- దర్శకత్వం : అరుణిమా శర్మ, హోమీ అదజనియా
- రచన : అరుణిమా శర్మ, హుస్సేన్ దలాల్, అబ్బాస్ దలాల్,
- సంగీతం : సచిన్ – జిగార్
- ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
- ఎపిసోడ్స్ : 8
- విడుదల తేదీ: జూన్ 15, 2023
స్టోరీ:
లావణ్యా సింగ్ (తమన్నా), రిషబ్ రాథోడ్ (సుహైల్ నయ్యర్) స్కూల్ డేస్ నుండి స్నేహితులు. కొన్ని సంవత్సరాలుగా సహ జీవనం చేస్తుంటారు. లావణ్యకు ఒక పార్టీలో రిషబ్ పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేస్తాడు. దానికి లావణ్య అంగీకరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? స్కూల్ డేస్ నుంచి ఇద్దరి ఫ్రెండ్ అయిన సింగర్ అర్జున్ గిల్ (ఆషిమ్ గులాటి) ఒక సితార్ విద్వాంసుడు ఎందుకు కేసు పెట్టాడు?
మంచి భర్త కోసం ఎదురుచూసే ప్రీత్ (అన్యా సింగ్), ముంబైలో చిన్న ఇంట్లో ఉండలేక తన భర్తతో ఎలాగైనా వేరు కాపురం పెట్టించాలని ప్రయత్నించే షీతల్ (సంవేదన), వివాహితను ప్రేమించానని తెలుసుకున్న షాహిద్ (హుస్సేన్ దలాల్), తమ రిలేషన్ ను బయట పెట్టలేని పార్టనర్ తో మెల్రాయ్ (సయాన్ బెనర్జీ). వీరంతా లావణ్య స్కూల్ మేట్స్. ప్రతి ఒక్కరికి, ఒక్కో కథ ఉంటుంది. అందరు తాము అనుకున్నది చేశారా లేదా? చివరికి ఏమైంది అనేది తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
రివ్యూ:
సహ జీవనం చేస్తూ పెళ్లి చేసుకోవడం సరి అయినదా? లేదా అని ఆలోచించే యువతి పాత్రలో తమన్నా నటించింది. ప్రస్తుతం ఉన్న సొసైటీలో రిలేషన్షిప్స్ పైన రీసెర్చ్ చేసి ఈ సిరీస్ లోని సన్నివేశాలను తెరకెక్కించారు. స్కూల్ ఫ్రెండ్ పైన క్రష్ కలిగిన అమ్మాయి, శారీరకంగా వేరొకరికి దగ్గర అవడం, ఇరుకు ఇంట్లో ఒక జంట ఎలా ఉంటారో చూపించారు. వాస్తవానికి దగ్గరగా ఈ సిరీస్ ను రూపొందించారు.
కథలో వచ్చే ట్విస్టులు అంతగా ఎగ్జైట్ చేయవు. తరువాత ఏం జరుగుతుందనేది ఆడియన్స్ సులభంగా ఊహిస్తారు. ఆఖరి 2 ఎపిసోడ్స్ చాలా రొటీన్ గా, సాగదీసినట్టుగా భావన కలుగుతుంది. సయాన్ బెనర్జీ ట్రాక్ ను స్టోరీలో ఇరికించి నట్టుగా అనిపిస్తుంది. ఆ లవ్ స్టోరీలో డెప్త్ లేదు.అయితే ట్విస్టులు, కథలో నెక్స్ట్ ఏం అవుతుందో ఊహించేలా ఉన్నప్పటికీ, అలా చూస్తూ ఉండేలా సిరీస్ తీయడంలో విజయం సాధించారు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేసిన తమన్నా ఈ వెబ్ సిరీస్ లో ఇప్పటివరకు చేయని రొమాంటిక్ సన్నివేశాలలో నటించారు. లావణ్య క్యారెక్టర్ లో నటనతో ఆకట్టుకున్నారు. నిను వీడని నీడను నేను అనే తెలుగు మూవీలో హీరోయిన్ గా నటించిన అన్యా సింగ్ ఈ సిరీస్ లో ప్రీత్ క్యారెక్టర్ లో డీసెంట్ నటనను కనపరిచింది. ఆషిమ్ గులాటీ, సుహైల్ నయ్యర్ మరియు ఇతర నటీనటుల తమ పాత్రల మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్:
- తమన్నా నటన,
- నేపథ్య సంగీతం,
మైనస్ పాయింట్లు:
- సాగదీసినట్టుగా ఉన్న సీన్స్
- రొటీన్ స్టోరి
- ఊహకు తగ్గట్టు సాగే కథ,
- ఊహించే ట్విస్ట్ లు,
రేటింగ్:
2.5/5
టాగ్ లైన్ :
‘జీ కర్దా’ రొటీన్ స్టోరి అయినా, కొన్ని సీన్స్ యూత్ కి కనెక్ట్ అవుతాయి. మోడ్రన్ ప్రేక్షకులు టైమ్ పాస్ కోసం చూడవచ్చు.
watch trailer :
Also Read: “ప్రభుదేవా” లాగే… 40 సంవత్సరాలు దాటిన తరువాత తండ్రులైన 14 సినీ సెలబ్రిటీలు..!
End of Article