సైలెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది..! ఈ సినిమా చూశారా..?

సైలెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది..! ఈ సినిమా చూశారా..?

by Mounika Singaluri

Ads

తెలుగులో జెర్సీ సినిమాతో అందరికీ సుపరిచితురాలైన శ్రద్ధ శ్రీనాథ్ కన్నడలో నటించిన చిత్రమే ఆపరేషన్ అలమేలమ్మ. ప్రస్తుతం ఈ మూవీ తెలుగు వెర్షన్ ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. థ్రిల్లర్ జోనర్ లో రూపొందించిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూద్దాం.ఈ కథ బెంగళూరులో జరుగుతూ ఉంటుంది. పరమేష్ (రిషి) అనాధ. తన వారంటూ ఎవరూ లేని జీవితాన్ని అతను గడుపుతూ ఉంటాడు.

Video Advertisement

రోజు గడవడం కోసం కూరగాయల మార్కెట్ లో పనిచేస్తూ ఉంటాడు. తనకి ఎవరూ పిల్లను ఎవ్వరిని సంగతి తెలుసు, అందువలన పెళ్లి కాని అమ్మాయిలు కనిపిస్తే చాలు వాళ్ళను పెళ్లికూతురుగా ఊహించుకుని మానసిక ఆనందాన్ని పొందుతుంటాడు.అతనికి ఖరీదైన జీవితాన్ని గడపాలని బ్రాండెడ్ వస్తువులు వాడాలనే ఒక పిచ్చి ఉంటుంది.అలాంటి అతనికి ఒక బట్టల షాపులో అనన్య (శ్రద్ధ శ్రీనాథ్) పరిచయం అవుతుంది.

how is this latest release

ఆమెను అదే పనిగా ఫాలో అవుతూ మొత్తానికి తన గురించి ఆమె ఆలోచించేలా చేస్తాడు. ఆమె ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది.  తండ్రి లేని కుటుంబానికి ఆమె ఆధారం. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి హాస్పటల్ ఖర్చులతో ఆమె సతమతమవుతూ ఉంటుంది. అనన్య ఆర్థికపరమైన ఇబ్బందులను అనుకూలంగా తీర్చుకొని ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలో రాహుల్ ఉంటాడు.ఇది ఇలా ఉండగా అనన్య స్కూల్లో చదువుతున్న జాన్ పెద్ద బిజినెస్ మాన్ అయిన కెనడీకి ఒకేఒక్క కొడుకు. అతను కిడ్నాప్ కి గురవుతాడు. 25 లక్షలు ఇస్తేనే జాను వదిలేస్తామని కిడ్నాపర్స్ డిమాండ్ చేస్తారు.

దాంతో అతను పోలీసులకి ఫిర్యాదు చేయడం స్పెషల్ ఆఫీసర్ గా అశోక్ రంగంలోకి దిగడం జరిగిపోతుంది.కిడ్నాపర్లు చెప్పిన చోట క్యాష్ బ్యాక్ ఉంచుతారు. పోలీసులు ఆ బ్యాగ్ బ్రాండెడ్ కంపెనీ కావడంతో దాని దగ్గర వెళ్లి పట్టుకుంటాడు రిషి.రిషినే కిడ్నాపర్ గా భావించి పోలీసులు అతని అరెస్టు చేసి జాన్ ఆచూకీ చెప్పమంటూ హింసిస్తారు. తనకేమీ తెలియదు అని ఎంత చెప్పినా వినిపించుకోరు. అప్పుడు అతను ఏం చేశాడు? జాన్ ని కిడ్నాప్ చేసింది ఎవరు? అనన్య పెళ్లి ఎవరితో జరుగుతుంది?అనన్య ప్రేమ కథకు రీషిని జైలు తీసుకెళ్లిన కిడ్నాప్ కథకు ముగింపు ఏమిటి? అనేది ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తించే అంశం.

ముందుగా ఈ సినిమా దర్శక రచయిత సునీ గురించి మాట్లాడుకోవాలి. ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమయ్యే ఓ యువతి. విలాసమంతమైన జీవితాన్ని కోరుకునే యువకుడు. ఈ నేపథ్యంలో జరిగే శ్రీమంతుని కొడుకు కిడ్నాప్. ఈ మూడు పాయింట్లను టచ్ చేస్తూ కథ నడుస్తుంది. హీరో హీరోయిన్లు పైన ప్రేక్షకులకు అనుమానాలు తలెత్తుతూ ఉంటాయి. కిడ్నాప్ ప్లాన్ కి అసలు సూత్రధారి ఎవరు అనేది ప్రేక్షకులకు షాక్ ఇచ్చే ట్విస్ట్.ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తేఈ కిడ్నాప్ డ్రామా కి సంబంధించిన సన్నివేశాలు ఆశించిన స్థాయిలో ఉత్కంఠను పెంచవు.

ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసాం కదా అనిపిస్తుంది కాకపోతే తక్కువ బడ్జెట్ లో తక్కువ పాత్రలతో మాత్రం కథను నడిపించడం సాధారణ ప్రేక్షకులకు పెద్దగా అసంతృప్తి కలిగించకపోవచ్చు. ప్రధాన పాత్రధారులు అందరూ బాగా చేశారు ముఖ్యంగా హీరో హీరోయిన్ లు తమ పాత్రను ఓన్ చేసుకున్న విధానం బాగుంది.అసలు ఈ సినిమాకి టైటిల్ పెట్టడం వెనక రీజన్ మాత్రం అందరికీ ఆమోదయోగంగా అనిపిస్తుంది. అభిషేక్ కాసర్ గడ్ ఫోటోగ్రఫీ, జూహద్ శాండీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సచిన్ బి రవి ఎడిటింగ్ కథను కాపాడుతూ వెళ్ళాయని చెప్పాలి.మొత్తంగా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమా పైన ఒక లుక్కేయవచ్చు.

 

Also Read:“నాగ చైతన్య” కి ఏమయ్యింది..? ఇలా మారిపోయారేంటి..?


End of Article

You may also like